రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? పుతిన్, జెలెన్స్కీలతో ట్రంప్ భారీ ప్లాన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై డొనాల్డ్ ట్రంప్ ఆశాజనక వ్యాఖ్యలు చేశారు. పుతిన్, జెలెన్స్కీలతో త్రైపాక్షిక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమని, యుద్ధం ఆపేందుకు రష్యా ఆసక్తిగా ఉందని ట్రంప్ వెల్లడించారు.
1. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అయ్యాయి.
2. రష్యా, ఉక్రెయిన్, అమెరికా నేతలు మళ్లీ కలవనున్నారా.?
3. ట్రంపు చర్చలకి ఈసారి ఎంత సిద్ధమవుతుందా?
4. మాటలు వరకేనా చేతలు కూడానా?
5. పూర్తి వివరాలు తెలియాలి అంటే కింద ఉన్న సమాచారాన్ని చదవ?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; ప్రపంచ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకునే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా కీలక చర్చలు జరగనున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యంగా మారింది.
జెలెన్స్కీతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, తాను పాల్గొనే త్రైపాక్షిక సమావేశం (ట్రైలేటరల్ మీటింగ్) జరిగే అవకాశాలపై స్పందించారు. ఈ సమావేశం జరిగే అవకాశముందా అని రిపోర్టర్లు ప్రశ్నించగా, “సరైన సమయంలో తప్పకుండా ఆ సమావేశం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ట్రంప్ మాట్లాడుతూ, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. “పుతిన్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇటీవల ఆయనతో నేను దాదాపు రెండున్నర గంటల పాటు ఫోన్‌లో మాట్లాడాను. ఆ సమయంలో అనేక కీలక అంశాలపై ఇద్దరము చర్చలు జరిపాము. అని ట్రంప్ వెల్లడించారు.
ముఖ్యంగా ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలనే ఆలోచన రష్యాకు ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. “ఈ యుద్ధం చాలా కాలంగా కొనసాగుతోంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని రష్యా కూడా కోరుకుంటోంది” అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు యుద్ధానికి రాజకీయ పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశాన్ని సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక జెలెన్స్కీతో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ పరిస్థితి, యుద్ధం వల్ల ఎదురవుతున్న నష్టాలు, భవిష్యత్‌లో భద్రతా హామీలు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు మద్దతు కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేసినట్లు సమాచారం. అదే సమయంలో శాంతి చర్చలపై కూడా తాను సానుకూలంగా ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అనేక దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించినప్పటికీ, స్పష్టమైన ఫలితం మాత్రం కనిపించలేదు. అయితే అమెరికా, రష్యా, ఉక్రెయిన్ నేతలు ఒకే టేబుల్‌పై కూర్చుని చర్చలు జరిపితే పరిస్థితి మారే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆ దిశగా ఒక ఆశాకిరణంగా భావిస్తున్నారు.
అయితే ఈ త్రైపాక్షిక సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అలాగే రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాల నుంచి కూడా ఈ వ్యాఖ్యలపై ప్రత్యక్ష స్పందన రావాల్సి ఉంది. అయినప్పటికీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధానికి ముగింపు దిశగా కొత్త చర్చలకు బాటలు వేయవచ్చన్న అంచనాలు పెంచుతున్నాయి.
మొత్తానికి, పుతిన్–జెలెన్స్కీ–ట్రంప్ భేటీ జరిగితే అది ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. యుద్ధం ముగింపుకు దారి తీసే శాంతి చర్చలు నిజంగా కార్యరూపం దాలుస్తాయా? లేక ఇవి కేవలం దౌత్య ప్రకటనలకే పరిమితమవుతాయా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. అంతవరకు ప్రపంచం మొత్తం ఈ పరిణామాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0