హాలీవుడ్‌లో విషాదం.. X-Men నటుడు ఎరిక్ డేన్ కన్నుమూత
ALS వ్యాధితో బాధపడుతూ హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ కన్నుమూశారు. Grey’s Anatomy, Euphoria సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడి మరణం అభిమానులను కలచివేసింది.
హాలీవుడ్ సినీ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఎరిక్ డేన్ (53) కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా Amyotrophic Lateral Sclerosis (ALS) అనే అరుదైన నాడీ సంబంధిత వ్యాధితో పోరాడుతూ చివరికి మృతి చెందినట్లు సమాచారం. ఈ వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎరిక్ డేన్ తన నటనతో హాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా X‑Men, Valentine’s Day, Bad Boys, Marley & Me వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే టెలివిజన్ రంగంలో కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా Grey’s Anatomy మరియు Euphoria సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు.
ALS అనే వ్యాధి నాడీ వ్యవస్థను దెబ్బతీసి క్రమంగా కండరాలను బలహీనపరుస్తుంది. దీనివల్ల మాట్లాడటం, ఆహారం మింగడం, శ్వాస తీసుకోవడం వంటి సాధారణ క్రియలు కూడా కష్టమవుతాయి. ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే విషయం ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ప్రస్తుతం దీనికి పూర్తిస్థాయి చికిత్స కూడా లేదు.
ఎరిక్ డేన్ మరణం హాలీవుడ్‌కు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన నటన, వ్యక్తిత్వం అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0