ఖమ్మం రాజకీయాల్లో మహిళల హవా.. ఓటింగ్‌లోనూ పోటీలోనూ వారిదే ఆధిపత్యం!
ఉమ్మడి ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు ఓటింగ్‌లోనూ పోటీలోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మహిళా ఓటర్లు, అభ్యర్థులు, రిజర్వేషన్ వివరాలు తెలుసుకోండి.
* ఎలక్షన్స్ లో నైనా, రాజకీయాల్లో అయినా ఖమ్మం వేరే
* 1,01,164 మహిళలు ఓటు వినియోగించుకున్నారంట!
* ఉమ్మడి ఖమ్మంలో ఆమెదే పైచేయి
* ఈ పోరులో ఎవరు గెలుస్తారు!
* పూర్తి వివరాలు లోనికి వెళ్తే :
ఫోర్త్ లైన్ ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు తమ ఆధిపత్యాన్ని ధైర్యంగా కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల్లో మొత్తం 1,93,833 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,01,164 మంది మహిళలే కావడం విశేషం. బరిలో ఉన్న 953 మంది అభ్యర్థుల్లో 473మంది మహిళలే కాగా.. ఏడు ఛైర్మన్ పీఠాల్లో ఆరు మహిళలకే రిజర్వు అయ్యాయి.
ఓటు వేసే వారిలోనూ, పోటీలోనూ ఆమెదే పైచేయి కావడంతో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే శాసించనున్నారు. మహిళలు ఈ విధంగా ఓట్ వేయడం చాలా మంచి విషయం అని ఈ వార్త విన్నవారు అభిప్రాయపడుతున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందు ఉంటే మన దేశం ఖచ్చితంగా అభివృద్ధి బాటలో ముందుంటుంది అని వార్త విశ్లేషకులు భావిస్తున్నారు మరి మీ ప్రాంతంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయా! ఈసారి ఎవరు గెలుస్తారు! మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0