జపాన్ భూకంపం మధ్య ప్రభాస్ క్షేమం – డైరెక్టర్ మారుతి స్పష్టీకరణ
జపాన్‌లో భూకంపం సంభవించిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రభాస్ క్షేమంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దర్శకుడు మారుతి స్పందిస్తూ ప్రభాస్ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* ప్రభాస్ పర్యటన వేళ జపాన్లో భూకంపం
* మీ హీరో క్షేమంగా ఉన్నారు అంటూ డైరెక్టర్
* ఈనెల 12న జపాన్లో బాహుబలి : ది ఏపిక్ '
* సినిమా ప్రచారం కోసం జపాన్ వెళ్లిన బాహుబలి హీరో
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news : టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ జపాన్లో పర్యటించడం జరుగుతుంది. ఈనెల బాహుబలి ది ఎపిక్ చిత్రం 12 వ తారీఖున జపాన్ లో విడుదల కానున్న సందర్భంలో ప్రభాస్ జపాన్లో ఉన్నారు. అక్కడ ఉన్న అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. అయితే జపాన్లో పెను భూకంపం సంభవించిందని వార్తతో ప్రభాస్ అభిమానులు ఆందోళన నెలకొంది.
ప్రభాస్ అభిమానులు మా హీరో ఎలా ఉన్నాడు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ అభిమాని డైరెక్టర్ మారుతిని ట్యాగ్ చేస్తూ జపాన్లో భూకంపం వచ్చింది కదా. సునామి హెచ్చరికలు జారీ చేశారు. అయితే మా హీరో అక్కడ ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడా అని ప్రశ్నించాడు. దానికి డైరెక్టర్ మారుతి స్పందిస్తూ ఈ విధంగా చెప్పారు. ప్రభాస్ తో ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఆయన క్షేమంగా ఉన్నారు అభిమానులు ఆందోళన చెందకండి అని జవాబు ఇచ్చారు. డైరెక్టర్ ఇచ్చిన సమాధానముతో అభిమానులు అంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0