సంతోషంగా దేవుని దర్శించుకున్నారు! కానీ రిటర్న్ ప్రయాణంలో ఘోర ప్రమాదం.. 8 మధ్యలో 1 మృతి ..
భద్రాచలం దర్శనం అనంతరం తిరిగి వస్తున్న సమయంలో పాల్వంచ జాతీయ రహదారిపై కారు–ఆటో ఢీకొని హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి రోషిత్ పటేల్ మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* అందరూ కలిసి భద్రాచలం వెళ్లి దర్శనం చేసుకోవాలనుకున్నారు !
* కానీ రిటర్న్ ప్రయాణంలో ఊహించని ప్రమాదం!
* ఆ ఎనిమిది మందిలో ఒకరు అక్కడికక్కడే మరణించడం జరిగింది!
* సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చే కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.
పాల్వంచ ఫోర్త్ లైన్ న్యూస్ : హైదరాబాద్ కు చెందిన 8 మంది విద్యార్థులు అందరూ కలిసి భద్రాచలం వెళ్లి అక్కడ ఉన్న సీతారామచంద్ర స్వామి (రాముడు) దర్శించుకుందాం అని బయలుదేరారు. కానీ ఆ 8 మంది విద్యార్థులు వెనుక ఉన్న ప్రమాదాన్ని గ్రహించలేకపోయారు. భద్రాచలం వెళ్లారు దేవుని దర్శించుకున్నారు కానీ తిరిగి ఆటోలో ప్రయాణిస్తుండగా పాల్వంచ జాతీయ రహదారిపై, కారు ఆటో బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో 8 మందిలో ఒకరు అయినా రోషిత్ పటేల్ అక్కడికక్కడే మరణించగా మరి ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అది గమనించి గాయపడిన వారిని త్వరగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0