రైతులకు ఊరటేనా? పంట నిల్వకు ‘సైలో’ వ్యవస్థపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!
పంట నిల్వకు ఆధునిక ‘సైలో’ వ్యవస్థను అమలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. బియ్యం, మొక్కజొన్నను రెండేళ్ల వరకు నిల్వ చేసే అవకాశం.
* రైతులకు ఉపయోగపడే కీలక నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం అడుగు వేసింది.
* పంటలను శాస్త్రీయంగా నిల్వ చేసేందుకు ఆధునిక ‘సైలో’ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు.
* ఈ విధానంలో బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను రెండేళ్ల వరకు భద్రంగా నిల్వ చేయవచ్చని తెలిపారు.
fourth line news: తెలంగాణ రాష్ట్రంలో పంట నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. సంప్రదాయ గోదాముల వల్ల తేమ, పురుగులు, ఆలస్యాల కారణంగా పంటలు నష్టపోతున్న నేపథ్యంలో, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘సైలో’ నిల్వ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ సైలో విధానంలో ఇంటిగ్రేటెడ్ క్లీనర్లు, డ్రైయర్లు ఉండటం వల్ల పంటలను శాస్త్రీయంగా శుభ్రపరచి, తగిన తేమ స్థాయిలో నిల్వ చేయవచ్చని తెలిపారు. బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలను రెండేళ్ల వరకు నాణ్యత కోల్పోకుండా భద్రపరచే అవకాశం ఈ విధానంలో ఉంటుందన్నారు. ముఖ్యంగా మిల్లింగ్‌లో జాప్యం జరిగినా ధాన్యం చెడిపోకుండా రైతులకు భరోసా కలుగుతుందని చెప్పారు.
సైలో వ్యవస్థ అమలుతో నిల్వ నష్టాలు గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుందని మంత్రి వివరించారు. పంటల నిర్వహణలో పారదర్శకత పెరిగి, సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని తెలిపారు. రైతులు పండించిన పంటకు తగిన సమయంలో న్యాయమైన ధర లభించేలా ఈ విధానం దోహదపడుతుందన్నారు.
ప్రథమ దశలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాల్లో సైలోలను ఏర్పాటు చేసి, తరువాత అన్ని జిల్లాలకు విస్తరించే ప్రణాళిక ఉందని వెల్లడించారు. ఆధునిక నిల్వ మౌలిక వసతులతో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రైతులకు ఎప్పుడు మేము తోడుగా ఉంటాము, రైతులు తమ ఎదుర్కొంటున్న ప్రతి కష్టాల నుంచి వాళ్ళని సంరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది అంటూ ఆయన వెల్లడించారు. ఇంకా రైతుల కొరకు కావలసిన అన్ని సదుపాయాలు, ఈ పథకాలు కూడా అందజేస్తాము అని ఆయన వెల్లడించారు. ఈ వార్తతపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రభుత్వం అందజేస్తున్న అన్ని పథకాలు మీకు అందుతున్నాయా?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0