ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద దూకిన ఐటీ ఉద్యోగిని – హృదయ విదారక ఘటన

హైదరాబాద్ చర్లపల్లిలో ఐటీ ఉద్యోగిని విజయ రెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భర్త విదేశాల్లో ఉండటం, పిల్లలు హాస్టల్లో ఉండటంతో ఒంటరితనం కారణమని పోలీసులు తెలిపారు.

flnfln
Feb 2, 2026 - 12:15
Feb 2, 2026 - 12:18
 0  24
ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద దూకిన ఐటీ ఉద్యోగిని – హృదయ విదారక ఘటన

* కన్న తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పిల్లలు భవిష్యత్తు నాశనమైంది. 

* భర్త విదేశాల్లో, పిల్లలు హాస్టల్లో, పని ఒత్తిడి! 

* చనిపోయే ముందు సూసైడ్ నోట్ లో ఏముంది ?

* పోలీసులు వెల్లడించిన విషయాల్లో ఏముంది?

fourth line news : ఆ తల్లి ఇద్దరు బిడ్డలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం, పోలీసులు బయటపెట్టడం జరిగింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఆత్మహత్య ఘటన మనందరికీ తెలిసిందే. చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై ఐటీ ఉద్యోగిని విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్‌తో కలిసి బలవన్మరణానికి పాల్పడటం ఎంతో బాధాకరం.. ఈ దారుణానికి ఆమెలో పేరుకుపోయిన ఒంటరితనమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఉప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన విజయ రెడ్డిసుందర్ రెడ్డి కి 2007 లో వివాహం జరిగింది. అయితే భర్త అయిన సురేందర్ రెడ్డి నాలుగేళ్లగా దుబాయ్ లోనే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. భార్య విజయ రెడ్డి తన తల్లితో కలిసి ఉంటుంది. విజయ రెడ్డి ఓ ఐటీ కంపెనీలో టీం లీడ్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంది. చేస్తున్న పనిలో కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ లు కారణంగా పిల్లల్నిద్దర్నీ చూసుకోవటం కుదరకపోవడంతో పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అయితే, భర్త దూరంగా ఉంటూ ఉద్యోగం చేయడం, పిల్లలు కూడా అందుబాటులో లేకపోవడంతో గత 15 రోజులుగా ఆమె చాలా తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నట్టు బంధువులు చెప్తున్నారు. ఇదే విషయం తన స్నేహితురాలితో కూడా చెబుతూ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. 

విజయ రెడ్డి ఈ ఒంటరితనాన్ని భరించలేక శనివారం తెల్లవారుజామున హాస్టల్ నుంచి పిల్లలను కారులు కారులో ఎక్కించుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద కార్ పార్క్ చేయడం జరిగింది. అక్కడే పార్కింగ్ ప్లేస్ వెనకాల " నాకు బ్రతకాలని లేదు. నేను లేకపోతే పిల్లలు అనాధలవుతారు. అందుకే నాతో పాటు తీసుకెళ్తున్నా" అని సూసైడ్ నోటు రాశారు. ఆ సూసైడ్ నోట్ ను ఫోటో తీసి తన వాట్స్అప్ స్టేటస్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అనంతరం పిల్లలతో కలిసి విజయ రెడ్డి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 

పోలీసులు ఘటన స్థలాన్ని వచ్చి పార్కింగ్ చేసిన కారును, కారులో ఉన్న సూసైడ్ నోట్ ను, విజయ రెడ్డి సెల్ఫోన్, లాప్టాప్ ను, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వీకరించిన వాటన్నిటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపనున్నారు. విజయా రెడ్డి ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితో మాట్లాడారు, ఎవరితో చాటింగ్ చేశారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు ఇంకో కోణంలో కూడా విచారణ చేస్తున్నారు కుటుంబ కలహాలు లేదా ఆస్తి తగాదులు ఏమైనా ఉన్నాయా ? కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలలో యువత కొంచెం అందరినీ బాధకి గురి చేసింది అని తెలుస్తుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.