“దొంగతనానికి హైటెక్ ప్లాన్… మేకప్‌కే నెలకు 5 లక్షల ఖర్చు! బెంగళూరులో దొంగ .....?
బెంగళూరులో దొంగతనాలకు హైటెక్ ప్లాన్ వేసిన దొంగ దంపతులు అరెస్ట్. మేకప్‌కే నెలకు 5 లక్షలు ఖర్చు చేసిన గాయత్రి షాకింగ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.
* దొంగతనం చేయాలి అంటే మేకప్ కు నెలకు 4 - 5 లక్షల ఖర్చు.
* బెంగళూరులో దొంగలు ప్లాను మామూలుగా లేదు
* ఎక్కువగా గుళ్లోనూ, రద్దీ ఉన్నచోట వీరి ప్లాన్
* చివరికి కటకటాల లోనికి వెళ్లాల్సి వచ్చింది
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
బెంగళూరు ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : ఈ మధ్యకాలంలో దొంగలు కూడా దొంగతనం చేయడంలో పిహెచ్డి చేశారేమో అని అనిపిస్తుంది. మాట ఎందుకు అంటున్నాను కింద ఉన్న సమాచారాన్ని చదవండి మీకే స్పష్టంగా అర్థం అయిద్ది. గాయత్రి, శ్రీకాంత్ వీళ్లిద్దరూ భార్య భర్తలు కానీ దొంగతనం చేయడంలో డబల్ పిహెచ్డి చేశారు.
ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. గాయత్రి భక్తి ముసుగులో గుళ్ళు, రద్దీ ఉన్న ప్రదేశాలలో బంగారాన్ని దొంగలించేది. ఆమె భర్త శ్రీకాంత్ కూడా ఇదే పనిలో ఉండేవాడు. అయితే పోలీసులు ఒకరోజు భర్త అయినా శ్రీకాంత్ను పట్టుకున్నారు. శ్రీకాంత్ ను పోలీసులు ప్రశ్నించగా పూర్తి నిజ నిజాలు బయటికి వచ్చాయి. ఇద్దరు కలిసి 60 లక్షల విలువైన బంగారాన్ని దొంగలించినట్టు పోలీసులు నిదారించారు.
గాయత్రి సంపన్న మహిళగా కనిపిస్తే దొంగతనం చేసిన కూడా ఎవరికి అనుమానం నెలకి దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షలు కేవలము మేకప్ కే ఖర్చు చేసేది అని పోలీసులు ముందు ఒప్పుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారంట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎంత పెద్ద దొంగ అయినా కూడా పోలీసులు తలుచుకుంటే సులువుగా పట్టుకోగలరు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి! ఇలాంటి దొంగల్ని ఎప్పుడైనా మీరు చూశారా? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0