16 వేల ఉద్యోగాలు! ఏ కంపెనీలో తెలుసా! ఇంతకీ మీ ఉద్యోగం గ్యారెంటీకేనా ....?
అమెజాన్ 30 వేల మంది ఉద్యోగాలను తొలగించడంతో ఐటీ రంగంలో ఆందోళన పెరుగుతోంది. ఒకప్పుడు ఉద్యోగం వస్తే చాలు అనుకున్న యువత, ఇప్పుడు ఉద్యోగం ఉంటుందా అనే భయంలో జీవిస్తోంది. మీ ఉద్యోగానికి గ్యారెంటీ ఉందా?
* ఉద్యోగం వస్తే చాలు అనే రోజులు పోయాయి.
* ఉద్యోగం పోకుండా ఉంటే బాగుండు అనే రోజులు వచ్చాయి
* అమెజాన్ 30 వేల మందిని ఉద్యోగాలు అవుట్
* మీ ఉద్యోగం ఉంటుందని గ్యారెంటీ ఉందా!
fourth line news : ఒకప్పుడైతే మంచి ఉద్యోగం వస్తే చాలు, లైఫ్ అంతా సెటిలైపోద్ది. అమ్మానాన్న చాలా హ్యాపీగా చూసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు యువత. కానీ నేటితరం యువత ఏమనుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనే దశలోనికి వచ్చారు. ఎందుకు ఈ మాట అంటున్నాను మీకే పూర్తిగా అర్థమయిద్ధి.
16 వేల ఉద్యోగాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తొలగించునుంది. మొత్తంగా చూస్తే అమెజాన్ 30 వేల మంది ఉద్యోగాలను తీసివేయాలి అని ప్రక్రియ మొదలుపెట్టింది. రెండో విడతలు దాదాపుగా 16 వేల మందిని తొలగించునుంది. గత అక్టోబర్లో 14,000 మందిని ఇంటికి పంపించగా తాజాగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఉద్యోగస్తులలో తీవ్ర ఆందోళన రేపుతో ఉంది.
ఏ రోజున మా ఉద్యోగాలు పోతాయో అని యువత ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. 2023 లోను అమెజాన్ దాదాపుగా 27 వేల మందిని తొలగించింది. ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో మళ్లీ లేఆఫ్స్ బాట పట్టడం ఐటీ రంగంలో కలకలం రేపుతోంది. అమెజాన్, ఇంకా అనేక కంపెనీలను ఉద్యోగస్తులను తొలగిస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి ఉద్యోగాలు తొలగించడం పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంతకీ మీ ఉద్యోగం రేపు ఉంటుందా ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0