నిమ్స్‌లో 850 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. డాక్టర్లు, నర్సుల నియామకానికి సర్కార్ ఓకే!
తెలంగాణ నిమ్స్ (NIMS) ఆస్పత్రి విస్తరణలో భాగంగా 850 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామకం మరియు నిమ్స్ అభివృద్ధిపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
* 850 పోస్టులకి గ్రీన్ సిగ్నల్
* డాక్టర్, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది
* నిమ్స్) విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక
TG: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా మొత్తం 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నియామకాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది ఉండనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఆసుపత్రికి 125 వెంటిలేటర్లు మంజూరు చేయగా, సుమారు రూ.1,698 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ గ్రాంట్లు పెరగడంతో పాటు, ఏడాదిలోనే సుమారు రూ.122 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చినట్లు సమాచారం. ఈ చర్యలతో తెలంగాణలో అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0