యశ్ ‘టాక్సిక్’ కథలో అసలు ట్విస్ట్ ఇదే… భయంతో ఎదిగిన సామ్రాజ్యం!
యశ్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా కథ గోవా నేపథ్యంలోని నేర సామ్రాజ్యంపై సాగుతుంది. భయంతో ఎదిగిన ఒక వ్యక్తి ప్రయాణమే ఈ మూవీ హైలైట్.
యశ్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. 1940 నుంచి 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగే ఈ చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. అప్పటి సముద్ర తీర ప్రాంతాల అందాల వెనుక దాగి ఉన్న నేర ప్రపంచం, అక్రమ వ్యాపారాలు, రక్తపాతం, వెన్నుపోట్లతో నిండిన కథనాన్ని ఈ సినిమా చూపించనుంది. ఒక సాధారణ వ్యక్తి పరిస్థితుల వల్ల ఎలా క్రూరుడిగా మారి, భయాన్ని ఆయుధంగా మార్చుకుని తన నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడన్నది కథలో ప్రధాన అంశమని తెలుస్తోంది.
ఈ చిత్రంలో భావోద్వేగాలు, యాక్షన్, రాజకీయ నేపథ్యం కలగలిపి ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యశ్ పాత్ర గత చిత్రాల కంటే భిన్నంగా, మరింత గంభీరంగా, తీవ్రతతో కనిపించబోతుందని సమాచారం. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించిన వివరాల ప్రకారం సినిమా విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్, కాలపరిమితి ప్రతిబింబించే సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాతో యశ్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0