బాలిక హత్యాచార కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య!
మదనపల్లె బాలిక హత్యాచార కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు చెరువులో దూకి మరణించినట్లు ఎస్పీ ధీరజ్ వెల్లడించారు.
కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు: ఎస్పీ
AP: మదనపల్లె బాలిక హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఘటన తర్వాత అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా తప్పించుకున్నాడని, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని చెప్పారు. అయితే ఈరోజు ఉదయం చెరువులో దూకి అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, మృతదేహం లభ్యమైందని వెల్లడించారు. బాలికపై అతడు అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఎస్పీ నిర్ధారించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0