సంక్రాంతి రేసులో మరో సినిమా ఔట్? ప్రభాస్–చిరంజీవి సినిమాలకే అన్ని థియేటర్లా!
సంక్రాంతి సినిమా బరిలో రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతోంది. భారీ స్టార్ సినిమాల మధ్య కొన్ని చిత్రాలు రేసు నుంచి తప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ‘పరాశక్తి’ తెలుగు వెర్షన్‌పై అనుమానాలు మొదలయ్యాయి.
1. సంక్రాంతికి కొన్ని సినిమాలు తప్పుకున్నట్టే?
2. ప్రభాస్, చిరంజీవి సినిమాలకే అన్ని థియేటర్ల?
3. శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన 'పరాశక్తి.
4. విజయ్ నటించిన జననాయగన్ సినిమా?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; సంక్రాంతి బరిలో పోటీ రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్న వేళ మరో సినిమా రేసు నుంచి తప్పుకుంటుందనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన ‘పరాశక్తి’ తెలుగు వెర్షన్ సంక్రాంతి రిలీజ్ నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. జనవరి 10న తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయాలన్న ప్లాన్ ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకకపోవడం తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం వస్తుంది.
ఈ సంక్రాంతికి ఇప్పటికే భారీ చిత్రాలు బరిలో ఉండటంతో థియేటర్ కేటాయింపుల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా తెలుగులో ‘రాజాసాబ్’, ‘MSVPG’ వంటి స్టార్ సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో ‘పరాశక్తి’కి సరైన స్క్రీన్లు దొరకడం కష్టంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు తెలుగులో సినిమాను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇక ఇప్పటికే విజయ్ నటించిన ‘జననాయగన్’ సెన్సార్ సమస్యల కారణంగా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పరాశక్తి’ కూడా అదే బాట పట్టే అవకాశాలు కనిపించడంతో ఈ ఏడాది సంక్రాంతి పోటీ నుంచి కొన్ని సినిమాలు తప్పుకునే అవకాశలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తమిళంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న తేదీకే విడుదల చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ‘పరాశక్తి’కి తెలుగులో మంచి టాక్ఉ న్నప్పటికీ, సరైన థియేటర్ రిలీజ్ లేకపోతే కలెక్షన్లపై ప్రభావం పడుతుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే తెలుగు రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని, సంక్రాంతి తర్వాత అనుకూలమైన డేట్ చూసి విడుదల చేసే ఛాన్స్ ఉందని టాక్. కానీ మాటికీ ఆ మాటే గాని సంక్రాంతికి వస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విజయాన్ని సాధిస్తుంది. అందులో ఈ సంక్రాంతికి. ప్రభాస్ సినిమాతోపాటు, చిరంజీవి సినిమా రావడం అభిమానుల్లో కొంత ఉత్సాహాన్ని నింపింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. మరి మీకు ఇష్టమైన హీరో ఎవరు! సంక్రాంతికి ఏఏ సినిమాలు మీరు చూడబోతున్నారు? మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0