మెగాస్టార్ మాస్ రిటర్న్: MSVPG ఫస్ట్ డే కలెక్షన్ షాకింగ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన MSVPG సినిమా తొలి రోజే ₹84 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, చిరంజీవి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

flnfln
Jan 13, 2026 - 10:37
 0  3
మెగాస్టార్ మాస్ రిటర్న్: MSVPG ఫస్ట్ డే కలెక్షన్ షాకింగ్!

* చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ 

* మొదటి రోజే 84 కోట్లు గ్రాస్ కలెక్షన్ 

* చిరంజీవి డైలాగ్స్, టైమింగ్, ఎమోషనల్ అన్ని 

* ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా అంటున్న 

* పండక్కి కూడా వస్తువులు గట్టిగానే వస్తాయి అంటున్న! 

* పూర్తి వివరాలు లోనికి వెళ్తే : 

 fourth line news: మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ' మన శంకర వరప్రసాద్ గారు ( MSVPG ) నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లోనికి అభిమానులని ఎంతో సంతోష పెట్టింది అని చెప్పుకోవచ్చు. భార్య అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 

సినిమా రిలీజ్ అయిన తొలి రోజున 84 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసినట్టుగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అటు ప్రీమియర్ తో పాటు ఫస్ట్ డే కలిపి 84 కోట్లగా గ్రాస్ కలెక్షన్. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే మరో రికార్డ్ ఓపెనింగ్ గా ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి మంచి రెస్పాన్స్ ఈ సినిమాకి వచ్చింది అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. 

ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే హీరో చిరంజీవి లుక్, ఆయన ఎనర్జీ, ఆయన చెప్పే ప్రతి డైలాగ్ డైరెక్టర్లలో విజిల్స్ చప్పట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి అని చెప్పుకోవచ్చు. 

అలాగే చిరంజీవి గారు పోషించిన శంకర వరప్రసాద్ పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు ఇంకా మంచిదయింది అని అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ లోనే కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి అని ప్రేక్షకుల అభిప్రాయం. మొత్తంగా MSVPG మొదటి రోజే భారీ వస్తువులతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది అని చిరంజీవి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.