రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' సెట్‌లో వివాదం... పూర్తి వివరాలు లోనికి వెళ్తే...?

రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' షూటింగ్‌లో భద్రతా నిబంధనల ఉల్లంఘనపై AICWA ఆగ్రహం. ఆదిత్య ధర్ ప్రొడక్షన్ హౌస్ బీ62 స్టూడియోస్‌ను బ్లాక్‌లిస్ట్ చేయాలని డిమాండ్. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Feb 17, 2026 - 20:59
 0  5
రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' సెట్‌లో వివాదం... పూర్తి వివరాలు లోనికి వెళ్తే...?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న ధురంధర్ 2 షూటింగ్‌పై వివాదం చెలరేగింది. సినిమా సెట్లో భద్రతా నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చిత్ర నిర్మాణ సంస్థ బీ62 స్టూడియోస్ కార్మికుల భద్రతను నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో దర్శకుడు ఆదిత్య ధర్‌కు చెందిన ఈ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నిర్ణయించిందని సమాచారం. ఈ నిర్ణయానికి AICWA పూర్తి మద్దతు ప్రకటిస్తూ అధికారిక లేఖ విడుదల చేసింది.

లేఖలో కార్మికులు, టెక్నీషియన్ల ప్రాణాలు, భద్రత, గౌరవంతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడలేమని స్పష్టం చేసింది. ఏటా అగ్నిప్రమాదాలు, విద్యుత్ షాక్‌లు, సెట్లు కూలిపోవడం వంటి ఘటనల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చట్టానికి ఏ నిర్మాణ సంస్థ అతీతం కాదని, ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లలో కనీస భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు కావాలని కోరింది.

భద్రతా నిబంధనలు కఠినంగా అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సంఘం హెచ్చరించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.