ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్‌కు ప్రమాదం.. గుర్రపు స్వారీ చేస్తుండగా గాయం!

ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై అభిమానుల స్పందన మరియు ప్రభాస్ హెల్త్ అప్‌డేట్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

flnfln
Feb 16, 2026 - 12:40
 0  3
ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్‌కు ప్రమాదం.. గుర్రపు స్వారీ చేస్తుండగా గాయం!

* షూటింగ్లో గాయపడిన ప్రభాస్

* దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు

* గుర్రం స్వారీ సన్నివేశం, గుర్రం అదుపు తప్పింది 

* పూర్తి వివరాలు లోనికి వెళ్తే : 

fourth line news : గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన రాజా సాబ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో పాటు ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్‌పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్, ఫేస్-స్వాప్ ట్రోల్స్ భారీగా వచ్చాయి. “ప్రభాస్ కష్టపడటం లేదు… డూప్స్‌తోనే చేస్తున్నాడు” అంటూ కొందరు విమర్శించారు.

అయితే ఇప్పుడు ఆ ట్రోలర్స్‌కు అభిమానులు గట్టి సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గుర్రం అదుపు తప్పడంతో ప్రభాస్ కింద పడిపోయారు. చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది చిన్న గాయమేనని, ఆయన త్వరగా కోలుకుంటారని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సంఘటనను చూపిస్తూ అభిమానులు ట్రోలర్స్‌పై విరుచుకుపడుతున్నారు. “డూప్స్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నాడు… గాయాలు వచ్చినా పట్టించుకోకుండా పని చేస్తున్నాడు… ఇప్పుడు ట్రోలర్స్ ఏమంటారు?” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్రభాస్ ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్‌లో చేరనున్నారని సమాచారం. స్పిరిట్ సహా ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి కొంతకాలం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.