ఆసియా కప్ ట్రోఫీ భారత్‌కే.. మోహ్సిన్ నఖ్వీ క్లారిటీ!

ఆసియా కప్ ట్రోఫీని భారత్కు తానే అందజేస్తానని ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ప్రకటించారు. ట్రోఫీ హ్యాండోవర్ కోసం వేడుక నిర్వహించనున్నట్లు GEO న్యూస్ తెలిపింది. ఈ అంశం చివరగా ICC వద్ద తేలనుంది.

flnfln
Oct 22, 2025 - 16:39
 0  3
ఆసియా కప్ ట్రోఫీ భారత్‌కే.. మోహ్సిన్ నఖ్వీ క్లారిటీ!

ఆసియా కప్ ట్రోఫీ విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ ఆసియా కప్ ట్రోఫీని భారత్కు తానే అందజేస్తానని వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే నఖ్వీకి లేఖ రాసిందని తెలుస్తోంది.

"ట్రోఫీ హ్యాండోవర్ కోసం ఒక ప్రత్యేక వేడుక నిర్వహిస్తాం. BCCI అధికారులలో ఎవరు కావాలంటే వారు, విన్నింగ్ టీమ్‌లో అందుబాటులో ఉన్న ఏ ఆటగాడు అయినా ట్రోఫీ స్వీకరించొచ్చు" అని మోహ్సిన్ నఖ్వీ చెప్పినట్లు GEO న్యూస్ పేర్కొంది.

అయితే, ఈ వ్యవహారం చివరగా ICC స్థాయిలోనే అధికారికంగా తేల్చుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.