ఖమ్మంలో రోడ్డు ప్రమాదాలపై బ్రేక్—కలెక్టర్ అనుదీప్ స్పెషల్ యాక్షన్ ప్లాన్
ఖమ్మం నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 20 బ్లాక్ స్పాట్స్ వద్ద రంబుల్ స్ట్రిప్స్, సైన్‌బోర్డులు, లైన్ మార్కింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు.
ఖమ్మం నగరంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు జిల్లా అధికారులు నూతన ప్రణాళిక రూపొందించారు.
ఈ మేరకు శుక్రవారం సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత విభాగాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
నగరంలో ప్రమాదాలు తరచూ జరిగే 20 కీలక బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, అక్కడ రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే డ్రైవర్లు స్పీడ్ తగ్గించేలా హెచ్చరిక బోర్డులు, సైనేజీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ప్రధాన జంక్షన్ల వద్ద 'గో స్లో' అంటూ వైట్ పేయింట్ వేసి స్పష్టమైన లైన్ మార్కింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో నగరంలో రోడ్డు భద్రత మరింతగా మెరుగుపడనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0