లోన్ యాప్ వేధింపుల దారుణం – హైదరాబాద్ రామనగర్‌కు చెందిన యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ రామనగర్‌కు చెందిన ప్రేమ్ కుమార్ లోన్ యాప్ వేధింపులతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అక్రమ లోన్ యాప్‌ల ప్రమాదాలపై అధికారుల హెచ్చరిక.

flnfln
Feb 4, 2026 - 12:09
 0  5
లోన్ యాప్ వేధింపుల దారుణం – హైదరాబాద్ రామనగర్‌కు చెందిన యువకుడు ఆత్మహత్య

* ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి ఈ లోన్ యాప్స్ ద్వారా 

* మీరు కూడా లోన్ యాప్స్ ఉపయోగిస్తున్నారా! 

* HYD రామ్ నగర్కు చెందిన ప్రేమ్ కుమార్

* అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

HYD ఫోర్త్ లైన్ న్యూస్ ప్రతినిధి : లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారా జరా జాగ్రత్త! చాలామంది యువత లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకొని వారి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ రామనగర్కు చెందిన ప్రేమ్ కుమార్ ( 36 ) మన యువకుడు లోన ద్వారా డబ్బులు తీసుకున్నాడు. అతని చేసిన పెద్ద తప్పు. 

ప్రేమ్ కుమార్ లోన్ యాప్ నుండి తీసుకున్నది కేవలము 3000 మాత్రమే. కానీ ఆ లోన్ యాప్ 3000 అప్పు చెల్లించలేదని కారణముతో ప్రేమ కుమార్ ను వేధింపులకు గురి చేశారు బాధితుడితోపాటు కుటుంబసభ్యుల మార్ఫ్ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. 

ఎక్కడా తన యొక్క కుటుంబ పరువు పోతుంది అని ప్రేమ కుమార్ ఆత్మహత్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ కుమార్ లాగానే చాలామంది యువకులు లోన్ యాప్ ద్వారా చనిపోతున్నారు. ప్రభుత్వమే ఈ లోన్ యాప్స్ కి చెట్టుపరమైన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు, బాధితుడి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకోకండి, ఇలాంటి బ్లాక్ మెయిల్ చేసిన కూడా భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.