మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. 28 ప్రత్యేక రైళ్లు, అదనపు బస్సులు, హెలికాప్టర్ సేవలు
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 28 ప్రత్యేక రైళ్లు, అదనపు బస్సులు, హనుమకొండ–మేడారం హెలికాప్టర్ సేవలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.
* మేడారం జాతరకి సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం
* ప్రత్యేకంగా 28 రైళ్లు అందుబాటులో.
* బస్సులు సౌకర్యం కూడా పెంచనున్నారు
* భక్తులకు అందుబాటులోనికి హెలికాప్టర్ సేవలు కూడా
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : తెలంగాణలో జరిగే పెద్ద పండుగ ఏమైనా ఉంది అంటే అది సమ్మక్క సారమ్మల మహా జాతర అని అంటారు. మరి ఈనెల 28న ప్రారంభం కానున్న మహోత్సవానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యం మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పండుగ ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారమ్మల జాతర. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన సౌకర్యాన్ని కలిగించే విధంగా మార్గాలు రూపొందిస్తున్నారు.
భక్తులు కోట్లాదిమంది వస్తారు కాబట్టి దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 28 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. మేడారానికి రైల్వే మార్గం లేనందున, దగ్గరలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లైనా వరంగల్, కాజీపేట లకు ఈ రైలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఈనెల 28, 29 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు ప్రజలకు అందుబాటులోనికి వస్తయని అధికారులు చెప్పారు. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, నిజాంబాద్ నుంచి వరంగల్ కు, కాజీపేట నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం సులభంతరం కానుంది.
భక్తులందరూ రైల్వే ద్వారా వరంగల్, కాజిపేట్ స్టేషన్లకు చేరుకున్నాక అక్కడ నుంచి నేరుగా మేడారం గద్దెల వద్దకు వెళ్లేందుకు టి జి ఎస్ ఆర్ టి సి భారీ స్థాయిలో బస్సులను సిద్ధం చేసింది. రైల్వే స్టేషన్లో కూడా ప్రత్యేక బస్సులు పాయిండ్లను ఏర్పాట్లు చేసి, అక్కడ నుండి నిరంతరాయముగా బస్సులను నడుపుతారు, రైలు దిగిన భక్తులందరికీ బస్సులు అందుబాటులో ఉండేలాగా రైల్వే, ఆర్టీసీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, జాతర ముగిసే వరకు జనవరి 31 వరకు ఈ రవాణా సౌకర్యం కలుగుతుంది అని భక్తులు ఎక్కడ కూడా కలత పడాల్సిన అవసరం లేదు అని అధికారులు భరోసా ఇచ్చారు.
ప్రభుత్వాలు భక్తులకు అందుబాటులోనికి హెలికాప్టర్ సేవకుడు ప్రారంభించారు. హనుమకొండ నుంచి మేడారానికి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే ఇందులో రానుపోను ప్రయాణానికి 35,999 వరకు ఖర్చులు అవుతాయి అని నిర్వహణకులు తెలిపారు. సొంత వాహనాలు లేని వారికి, ప్రైవేట్ వాహనాల అధిక చార్జీల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి, రైలు బస్సులు అనుబంధం ఒక గొప్ప అవకాశం గా నిలుస్తుంది. ఈ ఏర్పాట్లు వల్ల భక్తులు సురక్షితంగా సౌకర్యవంతమైన ప్రయాణం చేసి మేడారం జాతలో పాల్గొని తిరిగి సురక్షితంగా ఇంటికి వెళ్లొచ్చు అని అధికారులు వెల్లడించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0