స్కూటీ స్కిడ్ అయింది.... వెనకాల నుంచి ట్రక్.. ఆరేండ్ల బాలుడు అక్కడికక్కడే మృతి.

సికింద్రాబాద్ నేరెడ్మెట్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. RK పురం ఫ్లైఓవర్ వద్ద స్కూటీ స్కిడ్ కావడంతో తల్లి కుమారుడు కిందపడగా, వెనుక నుంచి వచ్చిన ఆర్మీ ట్రక్ కుమారుడిపై నుంచి వెళ్లడంతో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి రాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

flnfln
Jan 21, 2026 - 16:23
 0  3
స్కూటీ స్కిడ్ అయింది.... వెనకాల నుంచి ట్రక్..  ఆరేండ్ల బాలుడు అక్కడికక్కడే మృతి.

* ఆ తల్లి కుమారుడు ఊహించి ఉండరు ! 

* సికింద్రాబాద్లో జరిగిన ఘోర ప్రమాదం 

* స్కూటీ స్కిడ్ అయ్యిందో లేదో ట్రక్కు తొక్కేసింది ! 

* అక్కడికక్కడే కుమారుడు మృతి, 

 సికింద్రాబాద్ ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : సికింద్రాబాద్లో ఒక సంఘటన హృదయాన్ని కలచివేసింది. ఓ తల్లి ఆరేండ్ల కుమారుడు స్కూటీ మీద వెళ్తున్నారు కానీ వారు ఊహించి ఉండరు మరణం వారిని వెంటాడుతుంది అని. అసలేం జరిగింది అంటే, TG , సికింద్రాబాద్ నేరెడ్మెట్ పరిధిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 

RK పురం ఫ్లై ఓవర్ వద్ద స్కూటీ స్కిడ్ అయింది అంతే. దీంతో స్కూటీ మీద ఉన్న తల్లి కుమారుడు కింద పడిపోయారు. వారు పడిపోయిన వెంటనే వెనకాల నుండి ఒక పెద్ద ఆర్మీ ట్రక్ వారి పైనుండి వెళ్ళింది. అట్రక్ బ్రేకులు వేసిన కూడా చక్కగ లేదు చాలా తక్కువ ప్లేస్ స్కూటీ కి ట్రక్కుకి ఉన్నందున ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరేళ్ల కుమారుడు మరణించుకంగా, తీవ్రంగా గాయపడిన తల్లిని మాత్రము స్థానికులు వెంటనే అది గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదము జరిగిన తీరును సీసీటీవీ ఫుటేష్ ద్వారా వెలుగులోనికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పాపమ్మ తల్లి కూడా తెలిసి ఉండదు నా కుమారుడు చనిపోయాడు అని. సీసీటీవీ చూసిన వారందరి గుండె పిండేసినట్టు అయింది. 

అందుకని మన ప్రయాణించేటప్పుడు రోడ్డు ఏ విధంగా ఉంది అనేది చూసుకొని వెళ్తే మనకు ఎలాంటి నష్టము వాటి లేదు. ఈ ప్రమాదం లో ఎవరిది తప్పు అనేది ఎవరు చెప్పలేరు. పోలీసులు సీసీటీవీ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన ఉన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.