మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతులకు రైతు భరోసా : CM రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో రైతులకు కీలక హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించారు. రైతుల కోసం ప్రభుత్వం రూ.9000 కోట్ల నిధులు సిద్ధం చేసింది.
* త్వరలోనే రైతు భరోసా వస్తుంది.
* మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి
* మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతులందరికీ!
* రైతుల పక్షముగా ఉండే ప్రభుత్వం ఇది!;
ఫోర్త్ లైన్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణ రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు తర్వాత రైతు భరోసా ఇస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో ప్రకటించారు.
తెలంగాణ రైతులందరికీ రైతు భరోసా కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వేల కోట్లు రెడీ చేసాము అని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం రైతుల పక్షమున ఉండే ప్రభుత్వమని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి రైతు భరోసా పథకం వచ్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0