యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య – హనుమకొండలో విషాద ఘటన
హనుమకొండ జిల్లాలో యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* యువకుల వేధింపు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
* హనుమకొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది
* ఆత్మహత్య చేసుకునే ముందు ఒక యువకుడికి ఫోన్ చేసినా అనిత
* నీవల్లే చచ్చిపోతున్నాను అని చెప్పి. పురుగుల మందు తాగిందనిత.
హనుమకొండ ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : హనుమకొండ జిల్లాలో ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి యువకుల నుండి ఎదురైతున్న తీవ్ర వేధింపులు కారణంగా ఓ మహిళ కానిస్టేబుల్ ఏకంగా ఆత్మహత్యకి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఇద్దరిలో ఒకరికి ఫోన్ చేసి మీ ఇద్దరి వల్లనే నా జీవితం నాశనమైంది. అందుకే నేను చనిపోతున్నాను అని చెప్పిన తరువాత ఆమె పురుగులు మందు తాగి ప్రాణాలు తీసుకుంది.
పోలీసులు వెల్లడించిన ప్రకారం : అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏ ఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. ఈమె వరంగల్ జిల్లా పర్వతగిరి మండల సీత్యాతండాకు చెందింది. అయితే ఆమె దూరపు బంధువైన రాజేంద్రర్, నాలుగేళ్లగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ప్రేమగా సన్నిహితంగా ఉండటం జరిగింది. అయితే కొంతకాలంగా డ్యూటీ లో ఉన్నప్పుడు రాజేందర్ అనితకు వీడియో కాల్ చేయమంటూ. ఇతరులతో మాట్లాడద్దు అని వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు అనిత, కుటుంబ సభ్యులు పెళ్లినీ నిరాకరించడం జరిగింది.
రాజేందర్ మర్చిపోయిన అనిత ఈ క్రమంలో అనితకు తన క్లాస్మెట్ అయినా జబ్బార్‌లాల్‌తో స్నేహం ఏర్పడింది. అనిత తన వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకు. అయితే విషయం తెలుసుకున్న రాజేందర్ జబ్బార్‌లాల్ ఫోన్ చేసి అనిత గురించి చెడ్డగా చెప్పడం జరిగింది. అప్పటినుంచి జబ్బార్‌లాల్ కూడా ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకోవాలి అంటే డబ్బులు కచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ చేయసాగాడు జబ్బార్‌లాల్.
అటు రాజేందర్, జబ్బార్‌లాల్ ఇద్దరి నుంచి వస్తున్న వేధింపులు అనిత తాళలేక మానసికంగా ఇబ్బంది పడి ఈ నెల 27న రాజేంద్రకు ఫోన్ చేసి కన్నీరు. మీ ఇద్దరి వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని అని చెప్పగా ' రాజేందర్ ఆ మాటలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బదిలీచాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత గడ్డి మందు, కలుపు నీ వారానికి ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ. అనిత మృతి చెందటముతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక పోలీసులు రాజేందర్ , జబ్బార్‌లాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఎంతో కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన కూడా వేధింపులు తట్టుకోలేక అనిత ఆత్మహత్య చేసుకుంది. కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు చివరికి కన్నీరే మిగిలింది. వార్తపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0