ట్రాక్టర్ బోల్తా: జగిత్యాలలో నలుగురు రైతన్నలు మృతి

జగిత్యాల జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. పసుపు కోత నుంచి తిరిగివస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు రైతులు మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

flnfln
Feb 3, 2026 - 19:36
 0  3
ట్రాక్టర్ బోల్తా: జగిత్యాలలో నలుగురు రైతన్నలు మృతి

* అయ్యో పాపం కష్టాలన్నీ రైతులు కైనా ? 

* జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం 

* 15 మంది రైతులు టాక్టర్లు వెళ్తుండగా ! 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

జగిత్యాల ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : పాపం అన్ని కష్టాలు రైతులకి వస్తాయి. జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి రైతన్నలు నలుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం మల్లాపూర్ మండలం యోగిలిపేట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

రైతన్నలు పసుపు పంట కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో డాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో టాక్టర్లు సుమారుగా 15 మంది రైతులు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో నలుగురు రైతులు మృతి చెందారు. మిగిలిన వారికే తీవ్ర గాయాలయ్యాయి. ఆ సంఘటన చూసిన స్థానికులు వెంటనే ఘటన స్థలానికి వచ్చి గాయపడిన రైతుల్ని చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటివో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.