26 ఏళ్ల యువకుడికి ఉరిశిక్ష.. ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం

ఇరాన్‌లో నిరసనల్లో పాల్గొన్న 26 ఏళ్ల యువకుడికి ఉరిశిక్ష విధించడం కలకలం రేపుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కఠిన శిక్షలతో నిరసనలు ఆగుతాయా?

flnfln
Jan 13, 2026 - 10:09
Jan 13, 2026 - 10:13
 0  3
26 ఏళ్ల యువకుడికి ఉరిశిక్ష.. ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం

* ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయం 

* నిరసన తెలియజేస్తున్న 26 ఏళ్ల యువకుడికి ఉరిశిక్ష. 

* మానవ హక్కుల సంఘాలు వెల్లడించిన ప్రకారం 

* కఠినమైన శిక్షలు అమలు చేస్తే నిరసనలు ఆగుతాయా? 

* పూర్తి వివరాలలోనికి వెళితే :

fourth line news :ఇరాన్ లో ప్రభుత్వం వ్యతిరేకత పై చేస్తున్న నిరసనలు ఇంకా ఆందోళనకరంగా మారాయి. అక్కడ మానవ హక్కుల సంఘాలు వెల్లడించిన ప్రకారమైతే, ఆందోళనలో పాల్గొన్నందుకు ఇరాన్ ప్రభుత్వం 26 ఏళ్ల ఎర్ఫాన్ సుల్తానీ అనే యువకుడికి ఉరిశిక్ష అమలు చేస్తుంది అని తెలియజేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించిన మరణశిక్ష అమలు చేయడం ఇదే మొదటిసారి కానుండటముతో ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిరసన చేస్తున్న ప్రజలను దారినంగా ఇరాన్ ప్రభుత్వం చంపుతూ ఉరిశిక్ష లో వేధించడము ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. 

కేవలము కొన్ని రోజుల్లోనే విచారణ ముగించి అతనికి మరణ శిక్ష విధించారు. టెహ్రాన్ సమీపంలోని కరాజ్ సబర్ట్లో నివసించే సుల్తానీని ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకు జనవరి 8న అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అతనికి బుధవారం ఈ శిక్షను అమలు చేస్తున్నట్టు అతని కుటుంబానికి సమాచారము అందజేశారు. ప్రభుత్వం కూడా శిక్ష ఖరారైన తర్వాత పది నిమిషాలు మాత్రమే అతని కుటుంబ సభ్యులను కలిసే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. 

ఆ దేశంలో ఉన్న మానవ హక్కుల సంఘాలు ఈ కేసులో సుల్తానికి కనీసం నాయ హక్కులు కూడా కలిగించలేదు అని వారు తెలియజేస్తున్నారు. అలాగే లాయర్ ను కూడా పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చివరి లాయర్ అయినా అతడు సహోదరి కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నించిన అధికారులు నిరాకరించాలని వెల్లడించారు. ప్రాముఖ్యంగా నిరసనకారులను భయపెట్టి ఆందోళనలను అణిచివేయాలని ప్రభుత్వం ఇలాంటి వేగవంతమైన కఠిన చర్యలు తీసుకుంటుంది అని ప్రభుత్వాన్ని ఇంకా విమర్శిస్తున్నారు. 

ఇరాన్లో ఈ విధమైన నిరసనలు జరగటానికి ప్రధానమైన కారణం ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇరాన్లో నిరసనలు ప్రారంభమయ్యాయి అని తెలుస్తుంది. కొంతకాలములోనే ఈ నిరసన చెర వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని గద్దదించాలని డిమాండ్ తో అతిపెద్ద ఉద్యమంగా మారాయి. కానీ ఇరాన్ ప్రభుత్వం నిరసన తెలియజేస్తున్న ప్రజలను భయపెట్టేందుకు దొరికిన వారిని చంపుతూ, మరణశిక్ష విధించడం అనేది ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందుల్లోనికి నెట్టేస్తుంది అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. 

* ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్ష ఈ విధంగా అమలు చేయడం పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.