ఇరాన్‌లో భీకర ఆందోళనలు: టెహ్రాన్‌లోనే 200 మంది మృతి! ట్రంప్ షాకింగ్ వార్నింగ్
ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనల్లో టెహ్రాన్‌లోనే 200 మంది మృతి చెందినట్లు వెల్లడి. ఈ ఘటనలపై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి – Fourth Line News.
1. ఇరాన్ లో 200 మంది మృతి.
2. ట్రంప్ ఇరవై చేసిన హాట్ కామెంట్స్.
3. పౌరులను హతమరుస్తూ ఉంటే నేను చూస్తానా అంటున్న ట్రంప్?
4. వరల్డ్ వార్ త్రీ కి దారి తీస్తుందా?
ఇరాన్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తుండగా, తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. టెహ్రాన్‌లోనే దాదాపు 200 మంది నిరసనకారులు మృతి చెందారని ఓ వైద్యుడు వెల్లడించడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది. ఈ సంఖ్య అధికారికంగా ప్రకటించబడకపోయినా, వాస్తవ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని హ్యూమన్ రైట్స్ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఆందోళనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పులు, అరెస్టులు, కఠిన చర్యల కారణంగానే ఈ మృతులు సంభవించినట్టు సమాచారం. టెహ్రాన్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయని, ఇంటర్నెట్ సేవలను కూడా ప్రభుత్వం పరిమితం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నిజమైన పరిస్థితి బయటకు రావడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
“పౌరులను హతమారుస్తూ ఉంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. ఇరాన్ ప్రభుత్వం తన చర్యలకు బాధ్యత వహించాల్సిందే” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అవసరమైతే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు.
ట్రంప్ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇరాన్–అమెరికా సంబంధాలు సున్నితంగా ఉన్న నేపథ్యంలో, ఈ తాజా పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇరాన్‌లో పరిస్థితి ఎటు దారితీస్తుందో, అమెరికా స్పందన ఎంతవరకు వెళ్తుందో అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.
మొన్ననే వెనిజులా అధ్యక్షుడు పట్టుకున్న ట్రంప్, ఇప్పుడు ఇరాన్ తీవ్రంగా మండిపడ్డాడు, ఇరాన్ దీనిపై ఎలాంటి స్పందన ఇస్తుందో, అలాగే అమెరికా కూడా ఎలాంటి స్పందన ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి. 2026 స్టార్ట్ అయిందో లేదో స్టార్టింగ్ లోనే ఇన్ యుద్ధాలు గొడవలు దేశాల మధ్య జరగటం అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి యుద్ధాలు ఎంతటి యుద్ధానికి దారితీస్తాయో అని వార్తా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0