చైనా మాంజా కొనుగోలు చేస్తే కేసులే! తెలుగు రాష్ట్రాల్లో కఠిన చర్యలు
సంక్రాంతి పండుగ వేళ చైనా మాంజా దారాలు ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా అక్రమ విక్రయాలు కొనసాగుతున్నాయి. మాంజా కొనుగోలు చేస్తే చర్యలు ఏంటి? బైక్ వాహనదారులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
* చైనా మాంజా తెలుగు రాష్ట్రాలలో నిషేధం
* మాంజా కొనుగోలు చేసే వారిపై చర్యలు
* మాంజా దారాలు వల్ల అనేక ప్రమాదాలు
fourth line news : సంక్రాంతి వచ్చిందంటే చాలండి కొంతమందిలో ఆనందం, మరి కొంతమందిలో ఈ చైనా మాంజా దారాల వల్ల ప్రమాదం గాలిపటాలు ఎగరేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా కారణంగా తెలుగు రాష్ట్రాలలో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రాముఖ్యంగా హైదరాబాద్ నగరాలతో పాటు పరిసర జిల్లాలో బైక్ పైన వెళ్తున్న వాహనదారులకు తీవ్ర ప్రమాదాన్ని కల్పిస్తున్నాయి ఈ మాంజా దారాలు.
మాంజా దారం వల్ల ప్రమాదానికి గురైన వ్యక్తులు చేసిన ఫిర్యాదులు పై తెలంగాణ రాష్ట్రం మానవ హక్కుల కమిటీ సీరియస్గా స్పందించింది. ఈ విషయాలను తెలంగాణ పోలీస్ కమిషనర్ సజ్జనార్క నోటీసులు జారీ చేసింది. చైనా మాంజ వినియోగం మన రాష్ట్రాలలో, నిషేధం ఉన్నప్పటికిని, మార్కెట్లో అక్రమంగా విక్రయాలు కొనసాగుతున్నాయి అని పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే పోలీసులు కఠినమైన చర్యలు చేపడితేనే ఈ మాంజ దారాన్ని ప్రజలు కొనుగోలు చేయరు ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు.
అలాగే బైక్స్ పైన వెళ్తున్న వాహనదారులకు కూడా అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి అని మానవహక్కుల సంఘం కోరుతూ ఉంది. ఇప్పటికే ఈ మాంజ దారాల వల్ల అనేకమంది ప్రమాదాలకి గురైనట్టు సమాచారం. పండుగ సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగటంతో పండుగ వాతావరణం అంతా చాలా దెబ్బతింటుంది అని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
* బైక్ పైన వెళ్తున్న వాహనదారులు జాగ్రత్తగా ఉండండి!
* మీరు కూడా ఈ సంక్రాంతికి మాంజా దారాలు కాకుండా సాధారణ దారాలు వాడండి?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0