ఖమ్మంలో సైబీరియన్ కొంగల సందడి.. గ్రామానికి శుభ సూచకమంటున్న స్థానికులు

ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి సైబీరియన్ కొంగలు రావడం స్థానికుల్లో ఆనందం నింపింది. పక్షుల సంరక్షణతో గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రజల కోరుతున్నారు.

flnfln
Feb 18, 2026 - 20:55
 0  4
ఖమ్మంలో సైబీరియన్ కొంగల సందడి.. గ్రామానికి శుభ సూచకమంటున్న స్థానికులు

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అరుదైన అతిథులు సందడి చేస్తున్నాయి. జిల్లా పరిధిలోని చింతపల్లి గ్రామంకు వేల కిలోమీటర్ల దూరం నుంచి సైబీరియన్ కొంగలు చేరుకోవడం స్థానికులకు ఆనందాన్ని కలిగిస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ పక్షులు కనిపించకపోవడంతో గ్రామస్తులు నిరాశ చెందగా, ఈసారి మళ్లీ రావడం ప్రత్యేకంగా భావిస్తున్నారు.

ప్రతి సంవత్సరం చలికాలంలో వలస పక్షులు భారత్‌లోని పలు ప్రాంతాలకు వస్తుంటాయి. అయితే చింతపల్లి ప్రాంతానికి ఇవి రావడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. గ్రామస్తుల సమాచారం ప్రకారం, ఈ పక్షులు సుమారు ఆరు నెలల పాటు ఇక్కడే గడుపుతూ చెరువులు, సాగు భూముల పరిసరాల్లో విహరిస్తాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వీటి కిలకిలారావాలు గ్రామానికి కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయని వారు చెబుతున్నారు.

ఈ పక్షుల రాకను చాలా మంది శుభ సూచకంగా భావిస్తున్నారు. ప్రకృతి సమతుల్యతకు ఇవి సంకేతమని, గ్రామానికి మంచి రోజులు వస్తాయని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, పక్షుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గ్రామస్తులు కోరుతున్నారు.

పక్షుల సందడి కారణంగా ఇప్పటికే సమీప ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వీక్షిస్తున్నారు. సరైన సదుపాయాలు కల్పిస్తే చింతపల్లి పర్యాటక మ్యాప్‌లో చోటు సంపాదించే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.