మస్కిటో కాయిల్ వల్లే బస్సు అగ్నిప్రమాదమా? ఢిల్లీలో ప్రైవేట్ బస్సు క్లీనర్ సజీవదహనం

ఢిల్లీలో ప్రైవేట్ బస్సులో మస్కిటో కాయిల్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి క్లీనర్ సునీల్ సజీవదహనం అయ్యాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస బస్సు ప్రమాదాలతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.

flnfln
Feb 9, 2026 - 10:42
 0  4
మస్కిటో కాయిల్ వల్లే బస్సు అగ్నిప్రమాదమా? ఢిల్లీలో ప్రైవేట్ బస్సు క్లీనర్ సజీవదహనం

* రోజు రోజుకి ప్రైవేట్ బస్సులు అగ్నిలో కాలిపోతున్నాయి 

* ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన మీరు వింటే షాక్ అవుతారు 

* ప్రాణం తీసిన మస్కిటో కాయిల్ ? బస్సులో క్లీనర్ సజీవదహనం.

* * పోలీసులు వెల్లడించిన ప్రకారం

 fourth line news : ప్రైవేట్ బస్సులో క్లీనర్ సజీవదహనమైన ఘటన ఢిల్లీలోని వికాస్పురిలో చోటుచేసుకుంది. మృతుడిని సునీల్ (25)గా పోలీసులు గుర్తించారు. సునీల్ రాత్రి బస్సులో మస్కిటో కాయిల్ అంటించి నిద్రపోయాడని, దాని వల్లే బస్సుకు మంటలు వ్యాపించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

దర్యాప్తులో కచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు. బస్సుకి హరియాణా రిజిస్ట్రేషన్ నంబర్ ఉందని, ఈ బస్సు 28 రోజుల కిందటే సర్వీసులోకి వచ్చిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇలా వరుసగా బస్ ప్రమాదాలు జరగటం వల్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రజలు కూడా ప్రైవేట్ బస్సులో కన్నా గవర్నమెంట్ నడుపుతున్న బస్సులో సురక్షితము అని భావిస్తున్నారు. ఈ బస్సు ప్రమాదాలపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రైవేట్ బస్సులు సురక్షితమ! లేక ప్రభుత్వ బస్సులు సురక్షితమా?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.