రవి ఐదు రోజుల కస్టడీ ముగిసింది. రవి తరపున న్యాయవాది పిటిషన్.......?
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. బెట్టింగ్స్ యాప్ ప్రచారాలు, క్రిప్టో లావాదేవీలు, 35 బ్యాంక్ ఖాతాలపై పోలీసుల కీలక ఆధారాలు బయటపడ్డాయి. రవి తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు Fourth Line News.
Main points :
* ఐదు రోజుల కస్టడీ ముగిసింది
* దాదాపుగా 35 బ్యాంకుల ఖాతాలో కీలక ఆధారాలు
* రవి తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు
పూర్తి వివరాల్లోనికి వెళితే :
Hyderabad : fourth line news : పైరసీ వెబ్సైట్ అయినా ఐ బొమ్మ నిర్వాహకుడు రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీ ఈరోజు తో ముగిసింది. ఈ కస్టడీలో పోలీసులు కీలక సమాచారాన్ని బయటపెట్టినట్టు తెలుస్తుంది. ఐ బొమ్మ వెనక నేనొక్కడినే ఉన్నాను అని రవి చెప్పినప్పటికిని పైరసీ ఆరోపణలను అంగీకరించలేదని తెలుస్తుంది. దాదాపుగా బెట్టింగ్స్ యాప్ లో ప్రచారం ద్వారానే తనకు కోట్లల్లో ఆదాయం వచ్చినట్టు రవి అంగీకరించినట్టు తెలుస్తుంది.
పోలీసుల కస్టడీ ప్రకారం సుమారుగా 15 బెట్టింగ్స్ యాప్ లకు ప్రచారం చేశాడు. ముఖ్యంగా వన్ ఎక్స్ బెట్ ద్వారా భారీగా డబ్బులు రవి సంపాదించాడు. ఐ బొమ్మ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెల్లింపులన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలోనే జరిగినట్టు తెలుస్తుంది. రవి సుమారుగా 80 నుంచి 100 కోట్లు కొల్లగొట్టినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు ఇప్పటివరకు 35 బ్యాంకు ఖాతాలను గుర్తించగా వాటి ద్వారా 30 కోట్లు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు అయితే లభించాయి అని వెల్లడించారు.
అలాగే యాడ్ ఏజెన్సీ తో ఒప్పందాలు మరియు వ్యవహారాలు టెలిగ్రామ్ యాప్ ద్వారానే నడిపించినట్టు ఆధారాలు స్వీకరించారు. అలాగే తన స్నేహితుడు నిఖిల్ మరియు సహోదరి ఖాతాలకు మాత్రమే రవి డబ్బులు పంపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈరోజుతో రవి కస్టడీ ముగియడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. రవి తరపున న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నేడు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది.
* మీలో ఐ బొమ్మ రవి గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0