రణవీర్ సింగ్ ‘దురంధర్ 2’ మూవీ టీంకు ముంబై పోలీసుల షాక్

రణవీర్ సింగ్ నటిస్తున్న ‘దురంధర్ 2’ సినిమా షూటింగ్ సమయంలో అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించినందుకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ ముంబైలోని సురక్షిత పోర్ట్ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలు గుర్తించడంతో పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు చదవండి.

flnfln
Feb 3, 2026 - 16:34
 0  3
రణవీర్ సింగ్ ‘దురంధర్ 2’ మూవీ టీంకు ముంబై పోలీసుల షాక్

* రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 మూవీ పై కేసు 

* పర్మిషన్ తీసుకోకుండా డ్రోన్ ఎగరేసారని! 

* ఫిబ్రవరి 1న కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడి.

 fourth line news : రణవీర్ సింగ్ నటించిన అద్భుతమైన సినిమా దురంధర్ 2 , అయితే ఈ మూవీ టీంకు ముంబాయి పోలీసులు షాక్ ఇచ్చారు. సినిమా షూటింగ్ జరుగుతున్న వేళలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దక్షిణ ముంబైలోని అత్యంత భద్రత కలిగిన పోర్ట్ ప్రాంతంలో మూవీ టీం అనుమతి తీసుకోకుండా జోన్ ఎగరవేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్ పాల్ వాల్మీకి పై కేసు నమోదు చేశారు. 

ఈ నెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ కూడా పాల్గొన్నారు అనే సమాచారం. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనాధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నట్టు తెలుస్తుంది. డ్రోన్ వాడుతున్న సందర్భంలో గుర్తించిన పోలీసులు అధికారులు లోకేషన్ మేనేజర్ కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సినిమా సెట్ డిజైన్ లో భాగంగా జనవరి 30 న చరిత్రత్మక పోర్ట్ కాంప్లెక్స్ లోని కొన్ని భాగాలను పాకిస్తాన్లోనే ఒక శక్తివంతమైన పాతవీధి పోలి ఉండేలా ఏర్పాటు చేశారు అనే సమాచారం. 

ఏ మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలి. కానీ దురేందర్ టీం సభ్యులు అనుమతులు తీసుకోకపోవడంతో విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర పరికరాలు వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని పోలీసులు వెల్లడించారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.