ట్రంప్ సంచలనం.. భారత్‌పై 500% సుంకాల ముప్పు? రష్యా చమురు కొనుగోలే కారణమా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తున్న రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించే బిల్లుకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ జాబితాలో భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఉండటం గమనార్హం.
1. చైనా నుంచి చమరుకుంటే 500 శాతం సుంకాలు
2. మళ్లీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం రచ్చ రచ్చ?
3. వెళ్ళు ఆమోదించబడుతుందా?
4. భారత్, చైనా, రష్యా ఎలా స్పందిస్తాయి?
fourth line news : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కలకలం రేపుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్న రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించే బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై వచ్చే వారం అమెరికా సెనేట్‌లో ఓటింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఈ బిల్లుకు సంబంధించిన అంశాలపై రిపబ్లికన్ సెనెటర్ లిన్సే గ్రాహమ్ (Lindsey Graham) సోషల్ మీడియా వేదిక Xలో చేసిన పోస్టు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రష్యా చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న దేశాలే లక్ష్యంగా ఈ బిల్లు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాలో భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధానికి ఆర్థికంగా బలం చేకూర్చే చర్యలను అడ్డుకోవడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని ట్రంప్ వర్గాలు చెబుతున్నాయి. రష్యా చమురు కొనుగోలు ద్వారా అక్కడి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోందని, అందుకే అలాంటి దేశాలపై కఠిన చర్యలు అవసరమని అమెరికా భావిస్తోంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తే భారత ఆర్థిక రంగంపై ఒత్తిడి పెరిగే పరిస్థితి నెలకొనవచ్చని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.
వచ్చేవారంలో జరగనున్న ఓటింగ్లో ఈ బిల్ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో దీనిపై ప్రపంచ దేశాలు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం గ్లోబల్ పొలిటికల్ లో మరో కీలక మరుపుగా మారునుంది అనే సమాచారము సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఓటింగ్ ఇటువైపు వెళుతుందో అని ఇప్పటినుంచే ప్రజలలోను, అంతర్జాతీయ రాజకీయాలలో ఆసక్తి నెలకొంది. మరి ఓటింగ్ ఎటువైపు వెళ్ళనుంది! 500 శాతం సుంకాలు ఎంతవరకు కరెక్ట్? ట్రంపు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0