దావోస్ విమాన సమస్య తర్వాత ట్రంప్ చేతిపై గాయం..... ట్రంప్ కి ఏం జరుగుతుంది. ?
దావోస్ సమావేశానికి వెళ్తుండగా ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్యలు, ఇప్పుడు చేతిపై గాయం ఫోటోలు వైరల్. టేబుల్ తగిలిందన్న ట్రంప్ వివరణ వెనుక అసలు నిజం ఏమిటి? అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన ట్రంప్ గాయం పూర్తి వివరాలు.
* అసలు అమెరికా అధ్యక్షుడు కి ఏమైంది ?
* మొన్న దావోస్ మీటింగ్లో విమానం సమస్య ?
* ఇప్పుడేమో చేతికి గాయం ?
* ఆ గాయం వెనకాల ఉన్న అసలు రహస్యం బయటపెట్టినట్టు?
fourth line news : మొన్న ట్రంప్ దావోస్ మీటింగ్ కి వెళ్తుండగా ఒక్కసారే తను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికమైన సమస్యలు వాతిల్లాయి అని అధికారులు వెల్లడించారు. ట్రంప్ వేరే విమానంలో దావోస్ పర్యటనలో పాల్గొన్నారు. అక్కడ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన చేతి పై గాయం కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
మనం అనుకోవచ్చు చేతికే కదా గాయం అయింది అని ! కానీ అక్కడ సమస్య చేతికి గాయమైందని కాదు గాని ఎవరి చేతికి ఆ గాయము అయింది అనేదే ప్రాముఖ్యం. అక్కడ గాయపడింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కాబట్టి ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయ్యాయి. అయినా ట్రంప్ ఏ పని చేసినా కూడా అతి వైరల్ అవుతుంది లేండి.
అయితే ట్రంప్ చేతిపై ఉన్న గాయంపై మీడియా ప్రశ్నించగా... నేను ఆరోగ్యంగానే ఉన్నాను.... నాకు ఎలా అంటే సమస్య అనేది లేదు ! టేబుల్ చేతికి తగలడంతో గాయమయ్యింది. ఆ గాయానికి క్రీం రాశా. గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఆస్పిరిన్ తీసుకోవాలి. గాయాలు కావద్దనుకుంటే ఆస్పిరిన్ తీసుకోవద్దు' అని ట్రంప్ అన్నారు. కానీ ఆయన చేతి పైనున్న గాయం మాత్రం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. మరి మీరేమంటారు అదే బెంచ్ తగిలే గాయమైందా లేక ! మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0