కొత్త T రేషన్ యాప్ ; తెలంగాణ ప్రజలకు శుభవార్త . రేషన్ వివరాలు అన్నీ..?
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన T రేషన్ యాప్ ద్వారా రేషన్ కార్డు వివరాలు, కోటా, డీలర్ సమాచారం, తీసుకున్న సరుకుల వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.
* ప్రభుత్వం ప్రజల కోసం ఒక కొత్త యాప్ ని తీసుకొచ్చింది
* ఈ యాప్ ద్వారా రేషన్ సంబంధించిన అన్ని
* మన వివరాలు అన్నీ ఆ యాప్ లో ఉంటాయంట ?
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news కథనం : తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్ని తీసుకొని రావటం జరిగింది. ఈ యాప్ దేని గురించి అంటే ఎవరైతే రేషన్ కార్డు పై బియ్యం తీసుకుంటున్నారో వారి కొరకు ఈ యాప్ ని తయారు చేయడం జరిగింది: ఈ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో మనకికార్డు యాక్టీవ్లో ఉందా? ఆధార్తో లింక్ అయిందా? మీ రేషన్ డీలర్, షాప్ నంబర్, లొకేషన్, రేషన్ కోటా, ఇప్పటివరకు ఎంత అందుకున్నారు వంటి వివరాలు ఈ యాప్లో చెక్ చేసుకోవచ్చు.
ఇప్పటినుంచి T రేషన్ నుంచి మనము ఏవేమి తీసుకున్నాము అనేవి పూర్తిగా మనకే కనబడతాయి. ఇంకో మాట చెప్పాలి అంటే T రేషన్ యాప్ ద్వారా ఇతర మోసాలకు పాల్పడే వారికి ఇక అవకాశం ఉండదు అని తెలుస్తుంది. నేరుగా ఒక వ్యక్తి రేషన్ షాపుకు వెళ్లి ఏమేం తీసుకున్నారు అన్ని లోడ్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మీ ఇంటి దగ్గర ఉన్న రేషన్ డీలర్ అలాగే షాప్ నెంబర్ లొకేషన్ రేషన్ కోట ఇప్పటినుండి మనము ఏమేమి పొందుకున్నావో అన్ని వివరాలు ఈ యాప్ నుంచి మనము తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ యాప్ తీసుకొని రావటం ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే అవినీతి జరగకుండా ఇది ఉపయోగపడుతుంది అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ యాప్ మనము చదివే విధంగా తెలుగులో కూడా మార్చుకోవచ్చు.
ఈ యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ?
మన ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా దాంట్లో సెర్చ్ బార్ లో T రేషన్' యాప్ అని సెట్ చేసినప్పుడు వచ్చింది దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వివరాలు ఎంటర్ చేయాలి. అలాగే ప్రభుత్వం ఇటీవల మీసేవా వాట్సాప్, యూరియా యాప్నూ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడతాయి అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈమధ్య సోషల్ మీడియాను బాగా పడుతుంది. ఇలా అన్ని రంగాలలో వాడితే అవినీతి తక్కువ అవకాశం ఉంది ప్రజలు కూడా సులభంగా అన్ని పనులు చేసుకోవచ్చు.
* ప్రభుత్వాలు ఈ యాప్ను తీసుకురావటం మీకు ఎలా అనిపించింది. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా ప్రభుత్వ ప్రజలకు అందిస్తున్న అన్ని పథకాల వివరాలు రాయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు అన్ని ఈ న్యూస్ వెబ్సైట్ ద్వారా మీరు చదవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0