కొత్త సర్పంచ్ లందరూ శిక్షణ తీసుకోవాల్సిందే..! రేవంత్ అన్న వెనుక ఉన్న ప్లాన్ ఏంటి ?
తెలంగాణలో నూతన సర్పంచులకు సంక్రాంతి తర్వాత ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడండి.
1. సంక్రాంతి తర్వాత సర్పంచులు అందరికీ సెక్షన్ ఇవ్వబోతున్నారా.?
2. ఇంతకీ ఈ శిక్షణలో ఏమేమి ఉంటాయి తెలుసా!
3. ఒక్క బ్యాచ్ కి 50 మంది నుంచి 100 మంది సర్పంచులు
4. సీఎం రేవంత్ రెడ్డి సర్పంచులతో మాట్లాడనున్నారు
5. ఈ శిక్షణ వల్ల నాయకత్వ లక్షణాలు గ్రామ అభివృద్ధి జరుగుతుంది.
6. సర్పంచులకు శిక్షణ ఏంటి అనే ఆలోచన మీకుందా! అయితే కచ్చితంగా కింద ఉన్న సమాచారాన్ని చదవండి.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికైన వారికి సంక్రాంతి తర్వాత శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ శిక్షణ ద్వారా గ్రామాల పాలన అభివృద్ధి చెందాలి అని ప్రజల యొక్క సమస్యలను పరిశీలించే విధంగా లక్ష్యముతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.
ఈ శిక్షణ కార్యక్రమం ప్రధానంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులపై దృష్టి పెట్టనుంది. గ్రామ పరిపాలనలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమైనది కావడంతో, వారికి చట్టపరమైన అవగాహనతో పాటు పరిపాలనా నైపుణ్యాలు అందించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీల అధికారాలు, బాధ్యతలు, నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, గ్రామసభల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలి అనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం.
జిల్లాల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 50 నుంచి 100 మంది సర్పంచులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణా కాలంలో అనుభవజ్ఞులైన అధికారులు, నిపుణులు, పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అధికారుల ద్వారా లెక్చర్లు, ప్రెజెంటేషన్లు, ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానం వంటి అంశాలపై పూర్తిగా అవగాహన కలిగించునున్నారు,
ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను , నిధులను ఎలా వినియోగించాలో గ్రామాల్లో నైవేద్యంగా అభివృద్ధి పరుషాలు అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అలాగే ప్రతి గ్రామములోనూ ప్రజలకు అవసరమైన త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, పచ్చదనం, స్వచ్ఛత వంటి అంశాలపై సర్పంచులకు మార్గదర్శనం తెలంగాణ ప్రభుత్వం చేయనుంది. అలాగే గ్రామాన్ని ఎలా అభివృద్ధిపచ్చలో ప్రాముఖ్యంగా గ్రామంలో జరిగే సభలను ఎలా నిర్వహించి ప్రజల అభిప్రాయాలను ఏ విధంగా తెలుసుకోవాలో పూర్తి అవగాహన కలిగించబోతున్నారు.
గెలిచిన సర్పంచ్ల అందరిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన అనంతరమే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించనున్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు గెలిచిన వారందరికీ ప్రాముఖ్యంగా తెలియజేసే విషయం ఏమిటి అంటే గ్రామాల అభివృద్ధిపై దేశాన్ని దేశాన్ని చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వానికి ఉన్న ఆశయాలు, అభివృద్ధిలో ప్రణాళికలను సర్పంచులకు వివరంగా వివరించబోతున్నారు.
శిక్షణ తర్వాత సర్పంచులలో నాయకత్వపు లక్షణాలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ పరిపాలన మరింత పలోబితం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో గెలిచిన సర్పంచులకు అనుభవం లేని కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు గ్రామస్థాయిలో కూడా సర్పంచులకు శిక్షణ ఇచ్చి గ్రామ గ్రామాలు అభివృద్ధి చేయాలి అనే తెలంగాణ ప్రభుత్వం గట్టి నిర్ణయము తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ శిక్షణ వచ్చేసి సంక్రాంతి తర్వాత ప్రారంభం కానున్నట్టు ఈ శిక్షణ కార్యక్రమం గ్రామీణ పాలనలో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అని ప్రభుత్వం ఆశిస్తుంది.
నిజమే కదా గెలిచిన ప్రతి అధికారికి శిక్షణ ఇస్తే గ్రామాలను ఎలా అభివృద్ధి చేయా, ప్రజలకు సమస్యలను ఏ విధంగా పరిష్కరించా, ప్రాముఖ్యంగా గ్రామాల్లో త్రాగునీరు, విద్యు, రోడ్లు, మురికి కాలువలు వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయి. గ్రామాల్లో జరిగే కార్యక్రమాలు కూడా ఎలా నిర్వహించాలో ప్రజలతో ఎలా మమేకమై ఉండాలో ఈ శిక్షణలో సర్పంచులందరూ నేర్చుకుంటారు. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సర్పంచుల శిక్షణ గురించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా అనేక విషయాలను మీరు తెలుసుకోవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0