మేడారం జాతరలో లక్షలాది భక్తుల రద్దీ.. 14 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటలు..
మేడారం మహాజాతరలో లక్షలాది భక్తుల రద్దీ నెలకొంది. 14 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటలు పడుతుండగా, భారీ ట్రాఫిక్‌తో పాటు దర్శన క్యూల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూర్తి వివరాలు చదవండి.
* ఎటు చూసినా కూడా లక్షలాది మంది భక్తులు
* మేడారం జాతరలో భక్తులు తీపి ఇబ్బందులు పడుతున్నారు
* 14 కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే సుమారు మూడు గంటలు పడుతుందట.
* లక్షలాది మంది భక్తుల రావడంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు.
fourth line news : దేవుని చూసి సంతోషించి, మనసులో ఉన్న మొక్కలన్ని చెల్లించుకోవాలని మహా జాతరకు వచ్చిన ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. తెలంగాణ మేడారం జాతరకు లక్షలాదిమంది జనం తరలివస్తున్నారు. భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ తీరా స్థాయికి చేరింది. అయితే, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసినప్పటికీని కూడా, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా భారీ ట్రాఫిక్ తో తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు భక్తులు.
రద్దీ ఎక్కువ అవ్వడంతో మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు, విఐపి వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలు భారీగా చేరడంతో కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కేవలం 14 కిలోమీటర్లు ప్రయాణించడానికి సుమారుగా మూడు గంటల సమయం పడుతుందంటే ట్రాఫిక్ ఎంత ఇబ్బందిగా ఉందో మనకి అర్థమవుతుంది. అటు పోలీసులు కూడా ఎంతో శ్రమిస్తూ ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఉన్నారు.
జాతరలో అమ్మవారు గద్దెల వద్ద కూడా ప్రజలు ఎంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. క్యూ లైన్ పద్ధతి సరిగ్గా లేకపోవడంతో, ప్రజలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండటం వల్ల భక్తులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ అమ్మవార్లను దూరం నుంచే ధ్యానం చేసుకుని తిరిగి ప్రయాణం అవుతున్నారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెల పైకి చేరిన తరువాత భక్తులు రాక ఒకేసారిగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు సైతం చేతులెత్తేశారు. కాగా శనివారం అమ్మవార్లు వన ప్రవేశంతో మహాజాతర ముగియనుండి. అటు పోలీసులు కూడా ఎంతో శ్రమిస్తున్న కూడా భక్తులు రద్దీ పెరగటం వల్ల పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0