సర్పంచ్ అంటే ఇతడే.. ఇచ్చిన మాట కోసం ఎలుగుబంటిగా మారిన
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేడిలో ఓ వినూత్న ఘటన వెలుగులోకి వచ్చింది. కోతుల బెడద నుంచి గ్రామాన్ని రక్షిస్తానని మాట ఇచ్చిన సర్పంచ్, ఏకంగా ఎలుగుబంటి వేషం వేసి కోతులను తరిమికొట్టారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌లో జరిగిన ఈ ఆసక్తికర వార్త పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేడి
* నన్ను గెలిపియండి నేనేం చేస్తాను చూడండి ?
* ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజలకు షాక్ ఇచ్చిన సర్పంచ్
* ఏకంగా తనే యుద్ధ భూమిలోనికి దిగిన సర్పంచ్
* గ్రామస్తులందరూ హవాక్ అయ్యారు సర్పంచ్ చేసిన పని కి
* అసలు ఏం జరిగింది అంటే పూర్తి వివరాలు తెలుసుకోవాలి
fourth line news కథనం: సర్పంచ్ ఎన్నికల్లో కీలకమైన మార్పులను మనము చూసాము. తెలంగాణ రాష్ట్రంలో కోతులు వల్ల ప్రజలు ఎంతో విసుగిపోయారు. అది గమనించిన సర్పంచ్ అభ్యర్థులు నాయకులు ముందుగానే బోనులు ఏర్పాటు చేసి కోర్తులను పట్టుకున్నారు. మమ్మల్ని కోతుల నుండి తప్పిస్తే ఓట్లు వేస్తాము అని కొన్ని గ్రామాల్లో ప్రజలు అభ్యర్థులకి చెప్పారు. ఎలాగైనా గాని కోతులను గ్రామంలో నుంచి వెల్లగొట్టి సర్పంచ్ గా గెలవాలి అని అనేక రకాలు మార్గాలను వెతుకుతే ఉన్నారు.
నిర్మల్ జిల్లాలో సర్పంచ్గా గెలిచిన ఒక యువకుడు తన గ్రామంలో ఉన్న కోతులను వెళ్ళగొట్టడానికి తనే రంగంలోనికి దిగాడు. సర్పంచిగా గెలిచిన ఒక యువకుడు ఎలుగుబంటి వేషం వేసుకొని ఆ గ్రామంలో నుండి కోతులను వెళ్ళగొట్టడం జరిగింది. కోడెం మండలం లింగాపూర్ లో టిఆర్ఎస్ బలపరిచిన కమ్మరి రంజిత్ సర్పంచిగా గెలుపొందడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన మాట చొప్పున గ్రామములో కోతులు లేకుండా చేస్తాను అని తనే ఏకంగా ఎలుగుబంటి వేషం వేశాడు. ఆవేశం చూసిన కోతులు అక్కడ నుండి పారిపోయాయి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల యొక్క ఆశీస్సులను పొందుకున్నాడు ఆ యువకుడు.
గెలిచిన రంజిత్ ఈ విధంగా మాట్లాడారు : గత రెండు మూడేళ్లగా తమ గ్రామంలో కోతులు భయం ఎక్కువయింది. వీధి వీధికి కోతులను పట్టుకోవడానికి బోనులు ఏర్పాటు చేసినా కూడా ఇలాంటి ఫలితం లేదని ఆయన తెలిపాడు. అయితే కోతులను ఏదో ఒక విధంగా వెళ్ళగొట్టాలి అని యూట్యూబ్ లో చూడగా ఈ ఆలోచన వచ్చింది అని తెలిపారు. ప్రభుత్వం కూడా అన్ని గ్రామంలో కోతులు భయమును తప్పించాలి అని ఆదేశాలు జారీ చేశారు. నిజంగా ఏ నాయకుడైనా కూడా గెలవకముందు ఒకలాగా ఉంటాడు గెలిచిన తర్వాత ఒకలాగా ఉంటాడు కానీ మాట ఇచ్చిన తన గ్రామ ప్రజలకు దాన్ని నెరవేర్చాడు కడెం మండలం లింగాపూర్ లో రంజిత్ సర్పంచిగా ఎన్నికైన యువకుడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. మీ గ్రామంలోనూ ఏ పార్టీ గెలిచింది గెలవడానికి మీకు ఆయన ఏ ఆమె ఇచ్చారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0