HYD మెట్రో పిల్లర్ను ఢీకొన్న కార్ ! 2 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి... కారులో 8 మంది ఉన్నట్టు గుర్తింపు...
హైదరాబాద్ మేడిపల్లిలో అతివేగం కారణంగా ఘోర కారు ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
• వేగం వద్దు, ప్రాణం ముద్దు అన్నారు
• నేటి యువత వేగమే కావాలి అంటున్నారు!
• హైదరాబాదులో ఘోర కారు ప్రమాదం వాటిల్లింది
• కార్లో మొత్తం ఎనిమిది బంధువు ఉన్నట్టు గుర్తింపు
• పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
హైదరాబాద్ ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : అతివేగమే ప్రమాదానికి దారితీస్తున్నాయి. హైదరాబాదులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ప్రయాణిస్తున్న కారు అతివేగం కారణం వల్ల అదుపుతప్పి మెట్రో పిల్లలను బలంగా ఢీకొట్టదొంగతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు వనపర్తి జిల్లాకు చెందినవారు గుర్తించారు. సాయి వరుణ్, నిఖిల్ గా పోలీసులు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన ప్రకారం: ఎనిమిది మంది విద్యార్థులు కారులో ప్రయాణిస్తున్నారు. వీరు వనపర్తి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి కారు మేడిపల్లి వద్ద మెట్రో పిల్లర్ నెంబర్ 97ను అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయి వరుణ్, నిఖిల్ అక్కడే మరణించారు. వెంకట్, రాకేశ్, యశ్వంత్లకు తీవ్ర గాయాలు కాగా, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ సురక్షితంగా బయటపడ్డారు అని అధికారులు పేర్కొన్నారు.
ప్రమాదం వాటిల్లిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపాసుపత్రికి వెంటనే తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మెయిన్ గా ఈ ప్రమాదానికి కారణము అతివేగమే అని అధికారులు వెల్లడించారు. అతివేగం వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ కాలం యువత అస్సలకి పట్టించుకోవట్లేదు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0