దుస్తుల వివాదం: తప్పు ఒప్పుకున్న శివాజీ.. బేషరతుగా క్షమాపణ!... ఇదిగో వీడియో
హీరోయిన్ల దుస్తులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నటుడు శివాజీ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశం మంచిదైనప్పటికీ, వాడిన పదాలు తప్పు అని అంగీకరిస్తూ ఆయన విడుదల చేసిన వీడియో వివరాలు ఇక్కడ ఉన్నాయి.
1. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్న మహిళలు
2. బహిరంగంగా క్షమాపణలు తెలిపిన శివాజీ
3. మహిళల పట్ల తప్పు ఉద్దేశం లేదు
4. కొన్ని పల్లెటూరు భాషల వల్ల ఈ వివాదం
5. తప్పుడు పదాలను వాడినందుకు క్షమాపణలు తెలిపిన నటుడు
6. కింద ఉన్న వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది.
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;హీరోయిన్ల దుస్తులపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో నటుడు శివాజీ స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేసి తన వైఖరిని స్పష్టంచేశారు. మంచి ఉద్దేశంతో మాట్లాడిన సందర్భంలో తాను రెండు అసభ్య పదాలు ఉపయోగించానని, అవే ఇప్పుడు అపార్థాలకు కారణమయ్యాయని శివాజీ అంగీకరించారు.
తాను చేసిన వ్యాఖ్యలు మహిళలందరినీ ఉద్దేశించి కాదని, అలాగే ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలు, వివక్షల గురించి మాట్లాడే క్రమంలో భావోద్వేగానికి లోనై కొన్ని అభ్యంతరకర పదాలు ఉపయోగించానని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా వినిపించే భాషను తాను ఉపయోగించానని, అయితే అది తప్పేనని ఇప్పుడు గ్రహించానని చెప్పారు.
“మంచి మాటలు చెప్పాలనుకున్నప్పుడు కూడా భాష చాలా ముఖ్యం. నా ఉద్దేశం మంచిదే అయినా, వాడిన పదాలు తప్పుగా ఉన్నాయి. అలాంటి పదాలు వాడకుండా ఉండాల్సింది” అని శివాజీ అన్నారు. తన మాటల వల్ల మహిళలు, ముఖ్యంగా సినీ రంగానికి చెందిన హీరోయిన్లు బాధపడి ఉంటే అది తన బాధ్యతేనని ఆయన పేర్కొన్నారు. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా సమాజంలో మహిళల స్థానం గురించి కూడా శివాజీ మాట్లాడారు. నేటికీ చాలా చోట్ల స్త్రీని తక్కువగా చూస్తున్న పరిస్థితులు ఉన్నాయని, ఇది మారాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు మహిళలను తక్కువగా చూపించాలనే ఉద్దేశంతో కాదని, వారిని రక్షించాలనే ఆలోచనతోనే మాట్లాడానని వివరించారు.
హీరోయిన్ల దుస్తుల అంశంపై స్పందిస్తూ అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయముని అంగీకరిస్తూనే సమాజంలో ఉండే వాస్తవ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. దుస్తులు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛ కానీ ఇప్పుడు జీవిస్తున్న పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉంటే అది మహిళలకే మంచిది అన్న ఉద్దేశంతో నేను ఆ విధంగా చెప్పాను అనే శివాజీ తెలియజేశారు అయితే ఈ విషయం చెప్పే క్రమంలో తన మాటలు హద్దు దాటాయని ఆయన స్వయంగా ఒప్పుకోవడం జరిగింది.
శివాజీ అన్న మాటలకు పలువురు మహిళ సంఘాలు మరియు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. కొందరు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది మరి కొందరు ఆయన చెప్పిన క్షమాపణలను స్వీకరించడం జరిగింది. బహిరంగంగా తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పడం మంచి పరిమాణం అని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి చూస్తే భాష ఎంత శక్తి మైనదో అలాగే అది ఎంత బాధ్యతయంగా ఉపయోగపడాల్సిందో మరోసారి ఈ సంఘటనను బట్టి మనకి తెలుస్తుంది. మంచి ఉద్దేశ్యం ఉన్నా కూడా మాటలు తప్పుగా ఉంటే అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ఈ వివాదాలు బట్టి మనకి అర్థమవుతుంది. శివాజీ క్షమాపణలతో ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేకపోతే మహిళలపై జరుగుతున్న చర్చ మరింత లోతుగా కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది. దీన్నిబట్టి ఒక విషయం మాత్రం అందరికీ స్పష్టమవుతుంది మహిళల గౌరవం వారి వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో మాటలు మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ఈ సందర్భం మనకు బోధిస్తుంది. ఫోర్త్ లైన్ న్యూస్
Once a good man, always a good man.#Shivaji apologizes to those who were hurt by his unintentional words. pic.twitter.com/2Y9AyeqJ2A — CHITRAMBHALARE (@chitrambhalareI) December 23, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0