తుఫాన్ ప్రభావం: మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
‘మొంథా’ తుఫాన్ దాటికి తెలంగాణలో వాతావరణం మార్మోగిపోతోంది. పలుచోట్ల వానలు కురుస్తుండగా, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ ఒకరోజు సెలవు ప్రకటించారు. పిల్లలను బయటికి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0