సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం: 45 మంది హైదరాబాద్ యాత్రికుల దుర్మరణం
సౌదీ అరేబియాలో మక్కా–మదీనా మార్గంలో జరిగిన భయానక బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికులు మరణించగా, అందులో 18 మంది మల్లేపల్లి బజార్ ఘాట్ నివాసులు. ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
-
సౌదీ అరేబియాలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మొత్తం 45 మంది మరణించారు.
-
ప్రాణాలు కోల్పోయిన వారంతా హైదరాబాద్‌కు చెందినవారే అని సమాచారం, అందులో 18 మంది మల్లేపల్లి బజార్ ఘాట్ ప్రాంత నివాసులు.
-
ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బాధితులు మక్కా యాత్రకు వెళ్లి, మక్కా నుంచి మదీనా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
-
బస్సు ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ మంటలు చెలరేగి, ప్రయాణికులు తప్పించుకునే లోపే అగ్నికి ఆహుతయ్యారు.
-
ఈ ప్రమాదంలో మరణించిన 45 మందిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారని అధికారులు వెల్లడించారు.
-
మృతుల్లో రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్ తదితర 16 మంది గుర్తింపు జరిగింది; ఇంకా ఇద్దరి వివరాలు వెలువడాల్సి ఉంది.
సౌదీ అరేబియాలో ఈ తెల్లవారుజామున జరిగిన భయానక బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించినవాళ‌్లంతా హైదరాబాద్‌కు చెందిన వారేనని సమాచారం వస్తోంది. మృతుల్లో 18 మంది పాతబస్తా ప్రాంతంలోని మల్లేపల్లి బజార్ ఘాట్ నివాసులేనని అధికారులు వెల్లడించారు. దీంతో మల్లేపల్లి బజార్ ఘాట్ ప్రాంతం అంతా విషాద వాతావరణంతో ముంచెముల్లుతోంది.
ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఈ బాధితులు మక్కా దర్శనానికి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామున మక్కా నుంచి మదీనా దిశగా ప్రయాణిస్తుండగా, వారి బస్సు ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగి, ప్రయాణికులు స్పందించే లోపే అగ్ని వారిని చుట్టుముట్టిందని సమాచారం. బదర్–మదీనా మార్గంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మందిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు.
మృతుల వివరాలు…
మల్లేపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీ మరణించిన వారిలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇంకా ఇద్దరి వివరాలు నిర్ధారణ కావాల్సి ఉన్నట్లు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0