RTC, ప్రైవేట్ బస్సుల మధ్య తేడా ఏంటి? – తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
RTC బస్సులు, ప్రైవేట్ బస్సుల మధ్య భద్రత పరంగా తేడాలు ఏమిటి? RTCలో ట్రైనింగ్, ఆల్కహాల్ టెస్టులు, స్పీడ్ లాక్ కారణంగా ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. వివరాలు Fourth Line Newsలో.
బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది — RTC బస్సులు, ప్రైవేట్ బస్సుల మధ్య అసలు తేడా ఏంటి?
RTC (రోడ్డు రవాణా సంస్థ) బస్సుల్లో పనిచేసే డ్రైవర్లు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారే. ప్రతి రోజు డ్యూటీకి వెళ్లే ముందు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహిస్తారు. అందువల్ల మద్యం సేవించి వాహనం నడపే అవకాశం ఉండదు.
అదనంగా, RTC బస్సుల్లో స్పీడ్ లాక్ సిస్టమ్ ఉంటుంది. దీని వల్ల గంటకు 80 కి.మీ. వేగం దాటే అవకాశం ఉండదు. అందువల్ల ప్రమాదాలు జరగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇక ప్రైవేట్ బస్సుల విషయానికి వస్తే, వాటిలో చాలా బస్సులు రాత్రి వేళల్లో 120 కి.మీ. వేగంతో నడుస్తాయి. కొందరు డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. స్పీడ్ కంట్రోల్ లేకపోవడం, అలసటతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రజలు ప్రయాణానికి బస్సు ఎంచుకునే ముందు ఈ తేడాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0