“వారణాసి”పై రాజమౌళి ఆసక్తికరమైన విషయాలు, సినిమా రెండు పార్ట్ లాగా వస్తుందా ....?
మహేష్ బాబు “వారణాసి” సినిమా పై రాజమౌళి కీలక క్లారిటీ ఇచ్చారు. సినిమా సింగిల్ పార్ట్‌గా విడుదల కానుండగా, విడుదల తేదీపై కూడా ఆసక్తికర అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
* వారణాసి సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
* సినిమా రెండు భాగాలుగా వస్తుందా?
* ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది తెలుసా!
* మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు
* రాజమౌళి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.
fourth line news : మన మహేష్ బాబు నటిస్తున్న భారీ చిత్రం వారణాసి. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని ఇంకా రాజమౌళి ఎక్కువ చేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు.
రాజమౌళి ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా సీక్వెల్ ఉండదని సుమారు మూడు గంటల విడివిడితో సింగిల్ పార్ట్ గానే వస్తుంది అని రాజమౌళి స్పష్టం చేశారు. అలాగే సినిమా గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం తెలిపారు. ఈ సినిమాలో రామాయణంలోని భాగాన్ని ఇందులో చూపిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయం అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పుతుంది.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా భారీ యాక్షన్, అడ్వెంచర్ తో వస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. అభిమానుల్లో ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరల రాజమౌళి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి! fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0