రాజా సాబ్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది : ‘ఇది నిజంగా మారుతే తీశారా?’ అన్న నెటిజన్లకు
ప్రభాస్ 'రాజాసాబ్' సెకండ్ ట్రైలర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైరెక్టర్ మారుతి మేకింగ్ స్టైల్‌పై వస్తున్న కామెంట్లకు ఆయన ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ హారర్-కామెడీ విజువల్ ట్రీట్ విశేషాలు ఇవే!
1. రాజా సాబ్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది.
2. ఊహించని విధంగా ప్రభాస్ డైలాగులు
3. ఆ ఒక్క లుక్ చాలు సినిమాకి?
4. సినిమా తీసింది మారుతి నేనా అంటున్న ప్రేక్షకులు.?
5. మీరు ట్రైలర్ చూశారా?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; ఇటీవల విడుదలైన ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సెకండ్ ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ స్పందనను తెచ్చుకుంటోంది. ట్రైలర్ చూశాక చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా టోన్, విజువల్స్ ఉండటంతో “ఇది నిజంగా మారుతీనే తీశారా?” అనే ప్రశ్న నెటిజన్ల నుంచి రావడం విశేషం. దీనికి మారుతి ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.
“నేనే తీశా బ్రదర్” అంటూ మారుతి ఎంతో ఆత్మవిశ్వాసంతో స్పందించారు. అంతేకాదు, ఈ సినిమా కోసం తాను ఎంతగా కష్టపడ్డాడో కూడా ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. “ప్రేక్షకులకు డిఫరెంట్ స్టోరీ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా శ్రమపడ్డా. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నా కింగ్ ప్రభాస్‌కు ధన్యవాదాలు” అని మారుతి చెప్పడం సినిమాపై ఆయనకున్న కమిట్‌మెంట్‌ను తెలియజేస్తోంది.
‘రాజాసాబ్’ సెకండ్ ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని ఓ కొత్త కోణంలో చూపించారు. హారర్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ట్రైలర్‌ను కట్ చేయడం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. డార్లింగ్‌ను ఈజీ, స్టైలిష్, ఫన్ మోడ్‌లో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు ట్రైలర్ ఒక విజువల్ ట్రీట్‌లా మారింది.
మారుతి అంటే సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ సినిమాల డైరెక్టర్ అనే ఇమేజ్ ఉంది. కానీ ‘రాజాసాబ్’ ట్రైలర్ ఆ ఇమేజ్‌ను బ్రేక్ చేస్తోంది. విజువల్స్‌లో గ్రాండ్‌నెస్, కథలో కొత్తదనం స్పష్టంగా కనిపిస్తోంది. మారుతి ఈ సినిమాతో తనను తాను రీడిఫైన్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా కీలకం అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఫ్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఇలాంటి యాంగిల్ సినిమాను ఒప్పుకోవడం మారుతి చెప్పినట్టు ప్రభాస్ తనపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినిమాకు ప్రధాన బలంగా మారింది. ఈ ట్రైలర్లు అయితే ప్రభాస్ ఎనర్జీ చూస్తే ఈ సినిమా ఆయన కెరియర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశం ఉంది అని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.
ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ వస్తున్న మ్యూజిక్ ఒక స్పెషల్ గా పిలిచింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ ప్రతి సీనుకే తనదైన శైలిలో సంగీతాన్ని ఇచ్చి సినిమాపై ఇంకా హైట్ పెంచినట్టే కనిపిస్తుంది. మారుతి చెప్పినట్టే తమన్ మ్యూజిక్ ఈ ప్రాజెక్టును మరో సాయికి తీసుకువెళ్తుంది.
అలాగే ఇంత గ్రాండ్ గా ఈ సినిమా తనకక్కడానికి నిర్మాత విశ్వప్రసాద్ అందించిన సహకారం కూడా కీలకంగా మారింది. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ రావడం గొప్ప విశేషంగా మారింది. చాలామంది ఇది మారుతి సినిమా నేనా ప్రభాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు డియేటర్లలో ఈ సినిమా చూస్తూ మస్తు ఎంజాయ్ చేయొచ్చు అని కామెంట్స్ వేళ్లలో వస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాతనే అసలు నిజాలు తెలుస్తాయి అని అంటున్నారు. ఈ ట్రైలర్ మాత్రము అంచనాలను భారీగా పెంచేసింది అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
Trailer Peaked Here >>>> 🙏🔥🔥
Hero ,Director, Music Director went into God mode 🥵🔥🔥#Prabhas #TheRajaSaabTrailer pic.twitter.com/M9lFNnYE32 — ರಾಮಚಾರಿ ᵀᴼˣᴵᶜ ᴵᴺ ¹⁹-⁰³-²⁰²⁶ (@ramachari200) December 29, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0