పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘాన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, సంబంధాలు విరమిస్తున్నట్టు ప్రకటించారు. తాజా పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

flnfln
Oct 18, 2025 - 13:11
 0  3
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి
  • Main headlines 

  • పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఎటువంటి సంబంధాలు కొనసాగించబోమని స్పష్టం చేశారు.

  • ఆయన కాబూల్ ప్రభుత్వం భారత్ మరియు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థలతో కలిసి పాకిస్థాన్‌పై కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు.

  • ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదం ఎక్కడి నుంచి వచ్చినా వారికి భారీ ధర చెల్లించాల్సిందేని హెచ్చరించారు.

  • ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ దోహాలో ప్రతినిధుల సమావేశం నిర్వహణ జరగనుంది.

  • ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించగా, ఆ దాడిలో ముగ్గురు క్రికెటర్లు సహా 8 మంది మరణించారు; దీనిపై ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు త్రైపాక్షిక టీ20 సిరీస్ నుంచి తప్పుకోవాలని ప్రకటించింది.

  • పాక్ ప్రభుత్వం టీటీపీ అనుబంధ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్‌పై వైమానిక దాడులు చేశామని అంగీకరించింది; ఐదేళ్లుగా కాబూల్ నుంచి సరైన స్పందన రాలేదని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. 

పూర్తి వివరాల్లోనికి వస్తే ; 

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక సంచలన ప్రకటన విడుదల చేస్తూ, ఆఫ్ఘనిస్థాన్‌తో ఎటువంటి సంబంధాలు కొనసాగించబోమని స్పష్టం చేశారు. ఆయన ఆరోపణ ప్రకారం, కాబూల్ ప్రభుత్వం భారత్ మరియు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థతో కలిసి పాకిస్థాన్‌పై కుట్రలు సాగిస్తోంది. పాకిస్థాన్‌లో ఉండే ఆఫ్ఘనులు తక్షణమే తమ దేశానికి తిరిగి వెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు... “గతంలో మా భూమిలో ఆశ్రయం తీసుకున్న కాబూల్ శాసకులు ఇప్పుడు భారత్ ఒడిలో కూర్చుని మాపై కుట్రలు చేస్తున్నారని నేను పేర్కొంటున్నాను. ఇకపై శాంతి చర్చలు లేదా విజ్ఞప్తులు జరగబోవు. ఉగ్రవాదం ఎక్కడి నుంచి వచ్చినా వారి కోసం భారీ ధర చెల్లించాల్సిందే” అని హెచ్చరించారు. ఇటీవల తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ భారత్‌లో ఆరు రోజుల పర్యటన నిర్వహించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ముఖ్యమైన్నాయి.

ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ముగియగానే పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ఖతార్ దోహాలో సమావేశం కావనున్న నేపథ్యంలో కాల్పుల విరమణను మరింత పొడిగించినట్లు సమాచారం.

గతవారం సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఇరు వైపులా పలు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం పాకిస్థాన్ తమ భూమిపై వైమానిక దాడులు నిర్వహించినట్లు ఆఫ్ఘనిస్థాన్ ఆరోపించింది. ఈ దాడిలో ముగ్గురు క్రికెటర్ల సహా 8 మంది మరణించినట్లు సమాచారం. దీనిపై నిరసనగా, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పాక్‌తో జరగాల్సిన త్రైపాక్షిక టీ20 సిరీస్ నుంచి తప్పుకోవాలని ప్రకటించింది.

ఆఫ్ఘన్ సరిహద్దుల్లో టీటీపీ అనుబంధ సంస్థ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్‌పై పాక్ వైమానిక దాడులు చేసింది అని పాక్ అధికారులు ఒప్పుకున్నారు. నార్త్ వజిరిస్థాన్ ప్రాంతంలో ఏడుగురు పాక్ సైనికులు మరణించిన ఆత్మాహుతి దాడికి ఈ గ్రూప్ బాధ్యుడిగా ఉంది అని ఇస్లామాబాద్ పేర్కొంది. ఐదేళ్లుగా పాక్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కాబూల్ నుంచి సరైన స్పందన రాలేదని, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి 836 నిరసన లేఖలు మరియు 13 విజ్ఞప్తులు పంపినట్లు పాక్ రక్షణ మంత్రి వెల్లడించారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.