ఆపరేషన్ సిందూర్ రాముడి స్ఫూర్తితో సాగింది: ప్రధాని మోదీ
దీపావళి సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ రాముడి స్ఫూర్తితో సాగిందని, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో శాంతి దీపాలు వెలిగాయని పేర్కొన్నారు.
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు.
అయోధ్యలో శ్రీరామమందిరం నిర్మాణం పూర్తైన తర్వాత ఇది రెండో దీపావళి అని ఆయన గుర్తుచేశారు.
“ఈ పర్వదినం ఎంతో ప్రత్యేకమైనది. శ్రీరాముడు మనకు ధర్మబద్ధమైన ధైర్యం, అన్యాయానికి ఎదురు నిలిచే నైతిక బలం నేర్పాడు. ఇటీవల నెలల క్రితం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కూడా అదే రామస్ఫూర్తికి ప్రతీక” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
నక్సలిజం నిర్మూలనలో విజయం సాధించిన ప్రాంతాల్లో ప్రజలు దీపాలు వెలిగించారని, హింసను విడిచిపెట్టి రాజ్యాంగ మార్గంలో అభివృద్ధిలో భాగమవుతున్నారని ఆయన వివరించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0