ఐదుగురికి ప్రాణదానం చేసిన 10 నెలల చిన్నారి..
కేరళలో 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహం అవయవదానం ద్వారా ఐదుగురికి పునర్జన్మనిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన తమ బిడ్డ అవయవాలను దానం చేసిన తల్లిదండ్రుల గొప్ప నిర్ణయం మరియు అధికారిక లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల వివరాలు ఇక్కడ చదవండి.
* ప్రాణం పోతూ ఇంకో ఐదుగురికి ప్రాణం పోసింది చిన్నారి
* తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం!
* ఆ చిన్నారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
* ఆ చిన్నారి గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి
* పూర్తి వివరాలు ఉనికి వెళ్తే ;
fourth line news : కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచిన 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణదానం చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది హాజరై నివాళులర్పించారు.
పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దుఃఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దమని పలువురు కొనియాడారు.
ఫిబ్రవరి 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతయ్యలతో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఫిబ్రవరి 12న బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు నిర్ధారించారు. పుట్టెడు దుఃఖంలోనూ తల్లిదండ్రులు అవయవదానం చేయాలని ముందుకు రావడంతో కాలేయం, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను ఐదుగురికి అమర్చారు.
“మాటలకు అందని బాధలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసి కేరళ స్ఫూర్తిని చాటారు” అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. చిన్నారి శరీరం మట్టిలో కలిసినా, ఆమె అవయవాల రూపంలో ఇతరులలో జీవిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనతో కేరళ అంతా విషాదంలో మునిగిపోయినా, అవయవదానం ద్వారా కొత్త జీవితాలకు మార్గం చూపిన ఆ చిన్నారి స్ఫూర్తిగా నిలిచింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0