ఓజీ మూవీ రెమ్యునరేషన్ డీటెయిల్స్, విడుదల తేదీ & బుకింగ్స్‌పై వైరల్ అప్డేట్స్!

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన పారితోషికాలు, విడుదల తేదీ, బుకింగ్స్ వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

flnfln
Sep 24, 2025 - 12:18
 0  4
ఓజీ మూవీ రెమ్యునరేషన్ డీటెయిల్స్, విడుదల తేదీ & బుకింగ్స్‌పై వైరల్ అప్డేట్స్!

ఓజీ మూవీ రెమ్యునరేషన్ డీటెయిల్స్, విడుదల తేదీ & బుకింగ్స్‌పై వైరల్ అప్డేట్స్!

1 . పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్

పవన్ కళ్యాణ్ OG సినిమాకు రూ.80 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని లీక్ సమాచారం వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలో పెద్దగా చర్చనీయాంశంగా మారింది.

2. ఇతర తారాగణం రెమ్యునరేషన్ వివరాలు

  • ఇమ్రాన్ హష్మి – రూ.5 కోట్లు

  • డైరెక్టర్ సుజీత్ – రూ.8 కోట్లు

  • మ్యూజిక్ డైరెక్టర్ తమన్ – రూ.5 కోట్లు

  • హీరోయిన్ ప్రియాంక మోహన్ – రూ.1.5 కోట్లు

  • శ్రియా రెడ్డి – రూ.50 లక్షలు

3. సెప్టెంబర్ 25న గ్రాండ్ విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన OG సినిమా సెప్టెంబర్ 25, గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

4. స్టార్ కాస్ట్ & కీలక పాత్రలు

ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

5. ట్రైలర్, టీజర్‌తో అంచనాలు పెరిగిన సినిమా

ఫస్ట్‌లుక్, గ్లింప్స్, టీజర్, సింగిల్స్ ద్వారా ఇప్పటికే మూవీపై భారీ హైప్ ఏర్పడింది. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

6. అడ్వాన్స్ బుకింగ్స్‌కు విపరీతమైన స్పందన

బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రీమియర్ షోల టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

పవన్ కళ్యాణ్ OG మూవీ రెమ్యునరేషన్లు వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ OG సినిమాకు సంబంధించిన పారితోషికాల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. చిత్ర నిర్మాణ సంస్థ ఈ వివరాల్ని అధికారికంగా వెల్లడించకపోయినా, బయటకి వచ్చిన లీక్‌ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం దాదాపు రూ.80 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు తెలుస్తోంది.

విలన్‌గా కనిపించనున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కు రూ.5 కోట్లు, దర్శకుడు సుజీత్ కు రూ.8 కోట్లు, సంగీత దర్శకుడు తమన్ కు కూడా రూ.5 కోట్లు remunerationగా ఇచ్చినట్టు సమాచారం. హీరోయిన్ ప్రియాంక మోహన్ కు రూ.1.5 కోట్లు, శ్రియా రెడ్డికి రూ.50 లక్షలు చెల్లించినట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ remunerations లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.

ఓజీ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఓజీ విడుదలకు ఇప్పుడు కౌంట్‌డౌన్ మొదలైంది. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ హై octane యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25, గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి పవర్‌ఫుల్ విలన్‌గా, ప్రియాంక మోహన్ కథానాయికగా కనిపించనున్నారు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ మూవీ, టీజర్‌, గ్లింప్స్‌, సింగిల్స్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించింది. సెప్టెంబర్ 23న విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింతగా పెంచేసింది.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ లభించింది. ఇక బుధవారం రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయనుండటంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి — టికెట్లు వేగంగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఓజీ’ రెమ్యునరేషన్లు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి!

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ *‘ఓజీ’*పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటించిన తారాగణం, టెక్నికల్ టీమ్‌ తీసుకున్న పారితోషికాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తయారీదారులు ఈ తరహా వివరాలు అధికారికంగా బయటపెట్టడం సహజంగా జరగదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని లీక్‌ వివరాలు దుమ్మురేపుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం దాదాపు రూ.80 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీకి రూ.5 కోట్లు, దర్శకుడు సుజీత్కు రూ.8 కోట్లు, సంగీత దర్శకుడు తమన్కు రూ.5 కోట్లు, హీరోయిన్ ప్రియాంక మోహన్కు రూ.1.5 కోట్లు, మరో కీలక పాత్రలో కనిపించనున్న శ్రియా రెడ్డికి రూ.50 లక్షలు అందినట్టు టాక్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కోసం రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న వార్తలు వినిపించినా, తాజా లీకుల ప్రకారం అది రూ.80 కోట్లుగానే ఉన్నట్టు సమాచారం. ఇప్పుడీ రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఫాన్స్ మద్య పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఎంత రేంజ్‌లో ఉందో ఇది చెప్పే ఉదాహరణ అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ – ఫ్యాన్స్‌లో సందడి!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ తాజాగా ప్రారంభమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో టికెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్లు రిలీజ్ అయిన వెంటనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుండగా, తాజాగా సెప్టెంబర్ 25వ తేదీ నుంచి రెగ్యులర్ షోలకు కూడా టిక్కెట్లు ఓపెన్ అయ్యాయి. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై జోరుగా రియాక్ట్ అవుతున్నారు — ట్వీట్లు, పోస్టులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.