అమెరికా పర్యటనకు సిద్ధమైన నారా లోకేశ్: ఏపీ అభివృద్ధికి పెట్టుబడులపై దృష్టి
మంత్రి నారా లోకేశ్ డిసెంబర్ 6–9 తేదీల్లో అమెరికా పర్యటన చేపట్టనున్నారు. డల్లాస్‌లో భారీ ప్రవాసాంధ్ర సమావేశం, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చలు, ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానంపై ప్రధాన దృష్టి. – Fourth Line News
* మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన
* ఏపీ అభివృద్ధి కోసమే ప్రధాన లక్ష్యం
* పర్యటన భాగంలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు
fourth line news : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్య కారణంగా రాష్ట్ర ఐటీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ఇంకోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. వచ్చేనెల డిసెంబర్ మొదటి వారంలో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలను ఆహ్వానించడంతోపాటు రాష్ట్ర పలు అభివృద్ధి పనుల్లో భాగస్వాములను తీసుకొని రావడమే ముఖ్య ఉద్దేశం.
షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల డిసెంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మొట్టమొదటిగా డిసెంబర్ 6న డల్లాస్‌లో 'తెలుగు కమ్యూనిటీ విత్ నారా లోకేశ్' అనే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత పలు నగరాలైన శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రప్పించేందుకు లక్ష్యంగా తీసుకున్న అమెరికా పర్యటనలో భాగంగా, మంత్రి నారా లోకేశ్ డల్లాస్ సమీపంలోని గార్లాండ్‌లో ఉన్న కర్టిస్ కల్వెల్ సెంటర్లో ఒక భారీ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 8 వేల మంది ప్రవాసాంధ్రులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కేవలం అమెరికా నుంచే కాకుండా, కెనడా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఈ సభకు రానున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర, పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విస్తరణ, టెక్–ఐటీ రంగాల వృద్ధి వంటి అంశాలపై లోకేశ్ కీలక సందేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంతో భాగస్వామ్యం కావాలని, కొత్త పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా నడిపించడంలో తమ వాటా చూపాలని ప్రవాసాంధ్రులను కోరనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా దృష్టిపెట్టింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం వెల్లడించింది. అదే ఉత్సాహంతో మరిన్ని పెట్టుబడులను రాబట్టడానికి లోకేశ్ ఈ అంతర్జాతీయ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది.
ఐటీ, స్టార్టప్, ఎలక్ట్రానిక్స్ మరియు తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద పెట్టుబడి గమ్యస్థానంగా నిలవగలదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో డల్లాస్‌లో జరిగే సభ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
* మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వం చేస్తున్న యొక్క పర్యటనల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.
* ఇంకా ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందో మీ యొక్క ఆలోచన పంచుకోండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0