ప్రియుడు కోసం సొంత భర్తను హత్య? హత్య చేయడంలో PHD చేసినట్టుంది ?

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ప్రియుడి కోసం భార్య భర్తను బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి హత్య చేసిన కేసు సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు అరెస్ట్.

flnfln
Jan 26, 2026 - 19:55
 0  3
ప్రియుడు కోసం సొంత భర్తను హత్య? హత్య చేయడంలో PHD చేసినట్టుంది ?

* ప్రియుని మోజులో పడి కట్టుకున్న భర్తనే లేపేసిన భార్య 0

* బిర్యానీ చేసి నిద్ర మాత్రలు కలిపి ప్రియుడితో హత్య 

* ఈ హత్యలు ముగ్గురు నిందితులు అరెస్ట్ చేయబడ్డారు 

* ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే : 

fourth line news : కాలాలు మారే కొద్దీ ప్రేమలో కూడా మార్పు వచ్చింది అంటే ఇదేనేమో? పూర్వకాలంలో భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా జీవించేవారు. కానీ నేటి కాలంలో అలాంటి కట్టుబాటులో ఏమీ లేవు అని తెలుస్తుంది. గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రతి నోటా మారుమోగుతుంది. అసలు విషయంలోనికి వస్తే. 

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చెలవూరులో భర్తహత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడు అని భార్య ప్రియుడు ఇద్దరు కలిసి భర్తను అతికిరాతికంగా హతమచారు. ఈ ఘటనకు సంబంధించి భార్యతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం మీడియా ద్వారా వెల్లడించారు. 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోనికి వెళితే : చిలువూరు గ్రామానికి చెందిన శివ నాగరాజు ( 42 ) ఇతను ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. అయితే ఈ నెల 18న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భార్య లక్ష్మి మాధురి తెలిపిన ప్రకారమైతే గ్యాస్ సమస్య కారణంగా గుండెపోటుతో సహజంగానే చనిపోయాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది ఆ భార్య . అయితే అనుమానం వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మఠానికి తరలించగా శివ నాగరాజు ఛాతి ఎముకలు విరిగినట్టు తేలడంతో ఇది హత్యానని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనుమానిత మృతిగా కేసు నమోదు చేసి, లోతుగా విచారణ చేపట్టారు. 

పోలీసులు దర్యాప్తు లో ఊహించని నిజాలు బయటికి వచ్చాయి : లక్ష్మీ మాధురికి, సత్తన్న పెళ్లికి చెందిన గోపికి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి జీవించాలి అని కట్టుకున్న భర్తను చంపాలి అనే ఉద్దేశం కలిగి ఉంది. అనుకున్నట్టుగానే భర్త అడ్డు తొలగించుకోవాలి అని ప్రియుడితో కలిసి పథకం పండింది. ఈనెల 18న రాత్రి ఆమె బిరియాని లో కొన్ని నిద్ర మాత్రలు కలిపి భర్తకు పెట్టింది. అది తిన్న శివ నాగరాజు గాఢ నిద్రలో జారుకున్నాడు. భార్య తన ప్రియుడు గోపిని, తన స్నేహితుడు సురేశ్ ను ఇంటికి పిలిపించింది. ముగ్గురు కలిసి గాఢ నిద్రలో ఉన్న శివ నాగరాజును తిండితో ఊపిరాడకుండా చేశారు. గుండెలపై రోకలి కర్రతో శివ నాగరాజును కొట్టి అతన్ని చంపారు. భర్తను అతికిరాతకంగా చంపిన భార్య రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. 

లక్ష్మీ మాధురి విచారణలో, వివాహేతర సంబంధం గురించి తెలియడంతో భర్త తనను , శారీరకంగా, మానసికంగా వేధించాడు అని, అందుకే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసు లేదుట ఒప్పుకుంది. అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితురాలైన లక్ష్మీ మాధురిని, గోపి సురేశ్ లను అరెస్ట్ చేశారు . ఘటన జరిగిన వారం రోజుల్లోనే కేసును ఛేదించిన మంగళగిరి రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై వెంకట రవి, వారి సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.